Begin typing your search above and press return to search.

బీయారెస్ సైలెంట్... జేడీ లక్ష్మీనారాయణ ముందుకు

By:  Tupaki Desk   |   15 April 2023 6:40 PM GMT
బీయారెస్ సైలెంట్... జేడీ లక్ష్మీనారాయణ ముందుకు
X
విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూని ఆసరాగా చేసుకుని ఇటు ఉత్తరాంధ్రాతో మొదలెట్టి ఏపీ రాజకీయాలను పండించుకుందామని బీయారెస్ మాస్టర్ ప్లాన్ వేసింది. అందుకే గత కొన్ని రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఘాటు విమర్శలు చేస్తూ వచ్చింది. తెలంగాణా మంత్రి కేటీయార్ అయితే హాట్ హాట్ లెటర్ ఒకటి మోడీకి రాసి ప్లాంట్ ని ప్రైవేట్ చేస్తే ఒప్పుకునేది లేదు అని స్పష్టం చేశారు.

ఇక స్టీల్ ప్లాంట్ లో కొన్ని విభాగాలకు సంబంధించి మూల ధన సేకరణ నిమిత్తం మొదటి విడతగా ఈవోఐ కోసం బిడ్లను ప్లాంట్ ఆహ్వానించింది. దీంతో తాము బిడ్ దాఖలు చేస్తామని బీయారెస్ ప్రకటించింది. ఆ మీదట తెలంగాణాకు చెందిన సింగరేణి కాలరీస్ నుంచి డైరెక్టర్ల టీం విశాఖ స్టీల్ ప్లాంట్ కి వచ్చి మార్కెటింగ్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు.

ఈ లోగా కేంద్ర ఉక్కు  సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెప్పారు. అదంతా తన గొప్పతనమే అని క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకున్న బీయారెస్ ఒక్క రోజు తేడాలో కేంద్రం ప్రైవేటీకరణ ఖాయమని గట్టిగా ప్రకటించినా సౌండ్ చేయకపోవడం విశేషం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం కచ్చితంగా చెప్పిన మీదట కూడా బీయారెస్ నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు.

ఇక మొదటి విడతగా ఈవోఐ కోసం బిడ్ ని దాఖలు చేస్తామని చెప్పినా బీయారెస్ మౌనమే సమాధానం అయ్యింది. ఇదిలా ఉంటే సింగరేణి డైరెక్టర్ల టీం కేసీయార్ కి బిడ్ దాఖలు చేసే విషయంలో  ఒక నివేదికను అందించినట్లుగా ప్రచారం జరిగింది. ఆ నివేదికను చూసిన మీదటనే సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ మొదటి విడతగా ఈవోఐ  బిడ్ విషయంలో ఆసక్తి ఉందా లేదా అన్నది తెలియడంలేదు అంటున్నారు.

ఇదిలా ఉంటే సడెన్ గా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మొదటి విడతగా ఈవోఐ కోసం బిడ్ ని దాఖలు చేశారు. ప్రజల తరఫున తాను బిడ్ ని దాఖలు చేశాను అని ఆయన చెప్పారు. ప్రజలంతా కలసి కట్టుగా ఉంటే స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే ఉంచవచ్చు అని ఆయన అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని ప్రతీ ఒక్క కుటుంబం వంద రూపాయలు వంతున విరాళముగా ఇస్తే స్టీల్ ప్లాంట్ కి అవసరం అయిన మూలధనం 870 కోట్ల రూపాయలు సమకూరుతాయని అన్నారు.

తాను దాఖలు చేసిన బిడ్ ని తిరస్కరిస్తే కోర్టుకుని వెళ్తామని ఆయన ప్రకటించడం విశేషం. ఇదిలా ఉండగా జేడీ సడెన్ గా బిడ్ ని దాఖలు చేయడం బీయారెస్ మౌనంగా ఉండడం మీద చర్చ సాగుతోంది. జేడీ వెనకాల ఎవరు ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. జేడీ బీయారెస్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నది తెలిసిందే. ఆయన స్టీల్ ప్లాంట్ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ఇపుడు బిడ్ ని దాఖలు చేయడం ద్వారా జేడీ సంచలనం రేపారు.

మొత్తం మీద చూసుకుంటే స్టీల్ ప్లాంట్ విషయంలో బీయారెస్ ఆలోచనలు ఏమిటి అన్నది వెల్లడి కావడంలేదు మరో వైపు చూస్తే  ఈవోఐ బిడ్లను దాఖలు చేసేందుకు గడువుని ఈ నెల 15 వరకూ విధించగా దాన్ని ఈ నెల 20 దాకా పొడిగించారని అంతునరు. ఇక స్టీల్ ప్లాంట్ మొదటి విడత ఈవోఐ కోసం ప్రముఖ కంపెనీలు బడా కంపెనీలు పోటీ పడ్డాయని తెలిసింది. మరింతమంది బిడ్ల దాఖలు చేసేందుకు గడువ్నుని పొడిగించారని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.