Begin typing your search above and press return to search.

`గుడివాడ గుడ్డో పాఖ్యానం` ఏంటి మంత్రివ‌ర్యా.. వ‌దిలిపెట్ట‌రా?!

By:  Tupaki Desk   |   17 Feb 2023 6:00 AM GMT
`గుడివాడ గుడ్డో పాఖ్యానం`  ఏంటి మంత్రివ‌ర్యా.. వ‌దిలిపెట్ట‌రా?!
X
ఏపీ యువ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. గుడివాడ అమ‌ర్నాథ్‌.. ఇటీవ‌ల వారం నుంచి గుడ్డోపాఖ్యానం పేరిట పిట్ట‌క‌థ‌లు చెబుతున్నార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఫార్ములా 1 రేసింగ్ సంద‌ర్భంగా మొద‌లు పెట్టిన ఈ `గుడ్డు` వ్యాఖ్య‌లు.. ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా కూడా ఆయ‌న గుడ్డు గురించి మాట్లాడారు. ఎందుకంటే.. ఇటీవ‌ల మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి.. మూడు రాజ‌ధానులు లేవుఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ అన్న‌ట్టు ఉన్న‌ది ఒక్క‌టే విశాఖ అని తేల్చేశారు. దీంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ రాజ‌కీయ సెగ‌లు బ‌య‌ల్దేరాయి.

ఈ సెగ‌ల‌ను చ‌ల్లార్చేందుకు నాయ‌కులు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే గుడివాడ మ‌రోసారి మాట్లాడుతూ.. గుడ్డు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేదే తమ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. కొంత మంది దీనిపై విద్వేషాలు సృష్టిస్తున్నారన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని వ్యాఖ్యలు చేశారు. రాజధానుల అంశం చూసే కోణాన్ని బట్టి ఉంటుందన్నారు. కొత్త రాజధాని అంటే విశాఖపట్టణమే కదా.. మూడు చోట్ల నుంచి ముఖ్యమంత్రి పరిపాలన చేస్తారనే అనుమానాలను బుగ్గన నివృత్తి చేశారన్నారు.

పరిపాలనా రాజధాని విశాఖ మాత్రమే ఉంటుందని బుగ్గన ఉద్దేశమని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు. కాగా, కోడిగుడ్డుపై ఈక‌ల పీకుతున్నార‌ని గుడివాడ వ్యాఖ్యానించ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆస‌క్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల హైదరా బాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసింగ్‌ ను చూసేందుకు గుడివాడ అమర్‌నాథ్ వెళ్లారు. దీంతో ఏపీలో ఎప్పుడు ఈ రేసింగ్ నిర్వహిస్తారని మంత్రిని మీడియా ప్రశ్నించింది. అందుకు ఆయన వినూత్నంగా ‘‘కోడి గుడ్డు’’ కథ వినిపించడంతో నోళ్లు వెళ్లబెట్టడం జనం వంతైంది.

అప్ప‌ట్లో మంత్రి ఏమన్నారంటే.. ‘‘కోడి కోడిని పెట్టదు. గుడ్డును మాత్రమే పెట్టగలదు. అది గుడ్డు పెట్టాలి.. దానిని పొదగాలి. అది పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్‌ లో కోడి గుడ్డు పెట్టింది’’ అని గుడ్డోపాఖ్యానం వినిపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ-రేసు తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. హైదరాబాద్‌ తెలంగాణ ప్రజలు మాత్రమే నిర్మించిన నగరం కాదు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా నిర్మించుకున్న నగరం. హైదరాబాద్‌ ఎదుగుదలలో మా పాత్ర ఉందన్న భావన ప్రతి తెలుగువాడిలో ఉంటుందని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.