Begin typing your search above and press return to search.

ఏబీడీ అంతర్జాతీయ క్రికెట్​ కు ఇక నో ఛాన్స్ .!

By:  Tupaki Desk   |   19 May 2021 7:34 AM GMT
ఏబీడీ అంతర్జాతీయ క్రికెట్​  కు ఇక నో ఛాన్స్ .!
X
మిస్టర్​ 360 ఏబీ డివిలియర్స్​.. ఇక అంతర్జాతీయ క్రికెట్​ ఆడే అవకాశం లేదు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే డివిలియర్స్​ ఇంటర్నేషనల్​ క్రికెట్​ కు గుడ్​బై చెప్పాడు. కానీ డివిలియర్స్​ రీ ఎంట్రీ ఇచ్చే చాన్స్​ ఉందని వార్తలు వచ్చాయి. అందుకు కారణం ఐపీఎల్​ లో అతడి విధ్వంసక ప్రదర్శన. ఐపీఎల్​ లో రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు తరఫున ఆడే డివిలియర్స్​.. ఎన్నో మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్​ లను గెలిపించాడు. దీంతో అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. మరోవైపు డివిలియర్స్​ టీ20 వరల్డ్​కప్​లో దక్షిణాఫ్రికా తరఫున ఆడబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఏబీడీ కూడా కొన్ని సంకేతాలు ఇచ్చాడు.

అయితే తాజాగా దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్​ టూర్​ కు జట్టును ప్రకటించింది. అందులో డివిలియర్స్​ పేరు లేదు. దీంతో అసలు డివిలియర్స్​ అంతర్జాతీయ క్రికెట్​ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? లేదా? అన్న విషయంపై సందిగ్ధం నెలకొన్నది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు క్లారిటీ ఇచ్చేసింది. డివిలియర్స్​ ఇక మీదట అంతర్జాతీయ క్రికెట్​ లో ఆడబోవడం లేదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల సౌత్​ఆఫ్రికా క్రికెట్​ బోర్డు .. డివిలియర్స్​తో చర్చలు జరపగా.. అతడు రిటైర్మెంట్​కు కట్టుబడి ఉన్నట్టు వాళ్లకు చెప్పాడట.

2018 మే నెలలో డివిలియర్స్​ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్​బై చెప్పాడు. అప్పటికీ అతడు మంచి ఫామ్​లోనే ఉన్నాడు. అయినప్పటికీ రిటైర్మెంట్​ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి అతడి రీ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ లో ఆడాలని అతను ఆశించినా... చివరి నిమిషంలో ఈ విషయం చెప్పడంతో బోర్డు ఏబీ విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే అప్పటి వరల్డ్​కప్​లో సౌత్​ఆఫ్రికా పేలవ ప్రదర్శన ఇచ్చింది. అనంతరం డివిలియర్స్​ రీ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు తెరపడింది.