Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్, రిజ్వాన్ లను ఎవ్వరూ కొనలేదు

By:  Tupaki Desk   |   25 March 2023 9:00 PM GMT
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్, రిజ్వాన్ లను ఎవ్వరూ కొనలేదు
X
'ది హండ్రెడ్' లీగ్ వేలం పాటలో పాకిస్తాన్ క్రికెటర్లు బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్ లకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. టీ20 క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వీరిద్దరిని ఎవరూ కొనేందుకు ఆసక్తి చూపలేదు. లీగ్ లో భాగంగా బాబర్ ఆజమ్ కనీస ధర లక్ష యూరోలతో బరిలో దిగాడు. అయినా.. అతడిని ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అద్భుతంగా ఆడిన మహ్మద్ రిజ్వాన్ 12 మ్యాచుల్లోనే 550 పరుగులు చేశాడు. అదేవిధంగా బాబర్ ఆజమ్ 11 మ్యాచులు ఆడి 522 పరుగులు నమోదు చేశాడు.

ఈ లీగ్ లో అత్యధిక పరుగులు చేసింది వీరిద్దరే. ఈ నేపథ్యంలోనే 'ది హండ్రెడ్' లీగ్ వేలంపాటలో వీరిద్దరికీ మంచి ధర పలుకుతుందని అంతా భావించినా పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.

బాబర్, రిజ్వాన్ ను కొనేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్' లీగ్ లో ఎనిమిది జట్లు తలపడతాయి. వీటి కోసం జరిగిన డ్రాఫ్ట్ లోనే బాబర్, రిజ్వాన్ లకు చుక్కెదురైంది. హండ్రెడ్ లీగ్ లో జట్టు విజయం ప్రధానంగా భారీ షాట్లపైన ఆధారపడి ఉంటుంది.

బాబర్, రిజ్వాన్ ఇద్దరూ కూడా నెమ్మదిగా ఆడతారని.. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేవారు కాదని.. అందుకే ఎవరూ వారిని కొనేందుకు ఆసక్తి చూపలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం అంతా గమనించిన చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వారిద్దరినీ ట్రోల్ చేస్తున్నారు.

బాబర్ హాఫ్ సెంచరీ చేయాలంటేనే 100 బంతులు కావాలి.. ఇక్కడ అప్పటికీ మ్యాచ్ ముగిసిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.