Begin typing your search above and press return to search.

మేరా భారత్ మహాన్: మృత దేహాలను కూడా ఇలా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   4 Jun 2023 11:12 AM GMT
మేరా భారత్ మహాన్: మృత దేహాలను కూడా ఇలా చేస్తున్నారా?
X
ఒడిస్సా రాష్ట్రంలోని బాలాసోర్ దగ్గరలో జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ ట్రైన్ ని మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ వెళ్లి ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. కాసేపటికి అదే ట్రాక్ మీదకు వచ్చిన యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ కూడా ఢీకొనడంతో ప్రమాద స్థాయి పెరిగి దాదాపు ఇప్పటివరకు 300 పైగా మరణాలను నమోదు అయ్యాయి. 1000 మందికి పైగా క్షతగాత్రులు ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ ఏరియా కి సంబంధించిన డ్రోన్ విజువల్స్ చూస్తున్న ప్రజలందరూ వాటిని చూసి షాక్ అవుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే ప్రమాదం జరిగిన సమయంలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోలేకపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే అక్కడ గాయాల పాలైన వారిని మరణించిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్న కొన్ని వీడియోలైతే కండతడి పెట్టిస్తున్నాయి. పదుల సంఖ్యలో పక్కపక్కనే ఉన్న మృతదేహాలలో తన కుమారుడి మృతదేహం కోసం వెతుకుతున్న ఒక తండ్రి వీడియో ముగ్గురు రెస్క్యూ చేస్తున్న వాళ్లు ఆటో క్యారేజ్ లోకి మృతదేహాలను డంపు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే మరణించిన వారిపట్ల అక్కడి ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా మరణించిన వారిని చాలా గౌరవంగా భావిస్తూ వారి వారి కుటుంబ సభ్యులు ఇళ్ళకి తరలిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మరణించిన వారి సంఖ్య అధికంగా ఉండడం రెస్క్యూ చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉండడంతో మరణించిన వారిని ఏదో వస్తువులను విసిరినట్టుగా ఆటోలలో ఇతర వాహనాల్లో విసిరి వేస్తున్న విజువల్స్ అయితే షాక్ కి గురిచేస్తున్నాయి. భారతదేశము ఇంత అభివృద్ధి చెందిందని చెప్పుకుంటూ ఇలాంటి దుస్థితిలో ఉన్నాము అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.