Begin typing your search above and press return to search.

బండి సంజయ్‌ కి ప్రధాని మోడీ ఫోన్..గ్రేటర్ ఎన్నికలపై ఆరా!

By:  Tupaki Desk   |   2 Dec 2020 10:04 AM GMT
బండి సంజయ్‌ కి ప్రధాని మోడీ ఫోన్..గ్రేటర్ ఎన్నికలపై ఆరా!
X
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తో ప్రధాని మోడీ ఈ రోజు ఫోన్ లో మాట్లాడారు. తాజాగా జీహెచ్ ఎంసి ఎన్నికలు ముగియడం తో ఆ ఎన్నికల సరళ పై ఆరా తీశారు. సుమారు 10 నిమిషాల పాటు ప్రధాని మోడీ బండి సంజయ్ తో ఫోన్ లో ముచ్చటించారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు అధ్బుతంగా పోరాటం చేశారని అభినందించారు. నాయకుల, కార్యకర్తల పైన జరిగిన దౌర్జన్యం పై ప్రధాని మోడీ సంజయ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను ఈ సందర్భంగా కొనియాడార.

నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఇదే విధంగా ధైర్యంగా ముందుకు సాగాలని అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని మోడీ బండి సంజయ్ కి హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు ప్రధాని మోడీ. ఇకపోతే డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ ఎం సీ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో విజయం పై బీజేపీ , తెరాస ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. నేతలు ప్రచారం హోరెత్తిపోయేలా చేసినా కూడా ఓటింగ్ మాత్రం 50 శాతం కూడా మించలేదు.