Begin typing your search above and press return to search.

చేసిన మంచిని.. చెడుగా మార్చుకోవటం ఎలానో చూపిన పాక్ నటి

By:  Tupaki Desk   |   17 Sep 2022 4:24 AM GMT
చేసిన మంచిని.. చెడుగా మార్చుకోవటం ఎలానో చూపిన పాక్ నటి
X
చేసేది మంచి పనే అయినప్పటికీ.. చివర్లో చోటు చేసుకున్న చిన్న పొరపాటుతో పొగడ్తలు తర్వాత అందరితో తిట్టించుకున్న పాక్ నటి ఉదంతం తెలిస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. కొన్నిసందర్భాల్లో మంచి చేస్తూనే.. అది కాస్తా చెడుగా మారి జనాలతో తిట్టించుకునే ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది పాక్ నటి రేషమ్. కారులో ప్రయాణిస్తున్న ఆమె..ఒక నదిలో చేపలు.. ఇతర జలచరాలకు ఆహారం వేసే మంచి కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇలాంటి పనిని ఎవరైనా ఎందుకు తిడతారు? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. చివర్లో ఆమె చేసిన పని జనాల చేత తిట్టించుకునేలా చేసింది. ఆమె చేసిన తప్పేమంటే.. తనతో పాటు తచ్చుకున్న మాంసాహారం ముక్కల్ని తీసుకొని.. నదిలోని చేపలు తినేందుకు వీలుగా అందులోకి విసిరారు. ఇంతవరకు బాగానే ఉంది. చివర్లోనే తేడా కొట్టేసింది.

తన వద్ద ఉన్న మాంసాహారం ముక్కుల్ని నదిలోకి విసిరిన ఆమె.. చివర్లో తన చేతిలో మిగిలిన ప్లాసిక్ ప్లేట్ ను.. ప్లాస్టిక్ వకర్ ను అదాటున నదిలోకి విసిరేసిన వైనంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మాంసం ముక్కలతో పాటు.. బ్రెడ్ ముక్కలు వేయటాన్ని నెటిజన్లు తప్పు పట్టారు. ఎందుకంటే.. బ్రెడ్ ముక్కలు నదిలో వేసినంతనే.. అవి కరిగిపోతాయన్న విషయాన్ని గుర్తు చేసి.. అలాంటి పనులతో ఏం ప్రయోజనం? అంటూ ప్రశ్నించారు.

అంతేకాదు.. ప్లాస్టిక్ కవర్ ను అంత బాధ్యత లేకుండా నదిలోకి ఎలా విసిరేస్తావంటూ ఫైర్ అయ్యారు. అయితే.. ఆమె కావాలని చేయలేదని.. అనుకోకుండా అలా జరగినట్లుగా కొందరు నటికి దన్నుగా కామెంట్లు పోస్టు చేస్తున్నా.. అలాంటి వారి సంఖ్య తక్కువగా ఉంది. తాను చేసిన మంచి పోయి.. ట్రోలింగ్ చెడు తనను పట్టేసిన వేళ.. సదరు పాక్ నటి మీడియా సంస్థతో మాట్లాడింది.

ప్లాస్టిక్ ను తాను పొరపాటుగా నదిలోకి విసిరేసిన వైనాన్ని చెప్పుకున్నారు. తాను చేసిన మంచిని వదిలేసి.. చిన్న ప్లాస్టిక్ ముక్కతో తనను ట్రోల్ చేస్తున్న వైనాన్ని తప్పు పట్టారు. తాను మంచి పనే చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఏమైనా మంచి చేస్తూ చెడుగా మారి.. తిట్టించుకోవటం ఎలా అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా మారారని చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.