Begin typing your search above and press return to search.

నిప్పులేనా : జగన్ చూపుకు అందనంత దూరంగా వైసీపీ ఎంపీ...?

By:  Tupaki Desk   |   7 Aug 2022 9:30 AM GMT
నిప్పులేనా : జగన్ చూపుకు అందనంత దూరంగా వైసీపీ ఎంపీ...?
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు చూస్తే మాటలు తక్కువగా ఉంటాయి. యాక్షన్ మాత్రం ఉంటుంది. అందుకే జగన్ గురించి ఎవరైనా మాట్లాడాలీ అంటే ఆలోచిస్తారు. ఇక విపక్షలా సంగతి ఎలా ఉన్న సొంత పార్టీ నేతలు జగన్ కి ఎంత దగ్గరో అంత దూరం అని ప్రచారం ఉంటుంది. జగన్ చుట్టూ కన్నుకు కనబడని ఒక వలయం ఉంటుంది. అది దాటుకుని ఎవరూ లోపలికి రాలేరు అని చెబుతారు. ఇదిలా ఉండగా జగన్ కంటి చూపుతోనే తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు అని అంటారు.

ఇపుడు అలాంటి ఆగ్రహానికి గురి కాకూడదనే ఒక ఎంపీ ఏకంగా ఆయన కళ్ళ పడకుండా తప్పుకున్నారని అంటున్నారు. ఆయనే హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. జగన్ నీతి అయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్తే విమానాశ్రయంలో అందరి ఎంపీలు వచ్చి స్వాగతం పలికారు. కానీ ఒక ఎంపీ మాత్రం రాలేదు. మొత్తన్ కెమెరా అటెన్షన్ కానీ మీడియా ఫోకస్ కానీ ఆ వైపే ఉంది.

జగన్ కి ఆయన వెల్ కమ్ చెబుతారా లేదా అన్నదే అందరి ఆలోచన. అయితే మీడియాకు మసాలా పడలేదు. కానీ మరో రకం చర్చకు మాత్రం ఇది తావిచ్చింది. జగన్ గోరంట్ల మాధవ్ పట్ల ఆగ్రహంగా ఉండారని, ఆయన పేరు వింటే మండిపోతున్నారన్న వార్తలకు ఈ విధంగా బలం చేకూరింది. అందుకే ఆ విషయం తెలిసే ఎంపీ గారు జగన్ కను చూపు సోకినంత మేరా అందకుండా పోయారని అంటున్నారు.

ఇక ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఎంపీ మీద చర్యలకు ఎందుకు వైసీపీలో లేట్ సాగుతోంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. నిజానికి చూస్తే జగన్ ఎంపీలను చూడరు, ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోరు. ఆయన ఈ సంఖ్యాబలం అంతా టెక్నికల్ అని అనుకుంటారు. ఈ బలాన్ని ఇచ్చిన జనం గురించే ఆయన ఆలోచిస్తారు అని చెబుతారు. జనం కొలమానంగానే ఆయన నిర్ణయాలు ఉంటాయి.

అందువల్ల అవతల వ్యక్తి తన పార్టీ వారా కాదా అన్నది చూడకుండా యాక్షన్ తీసుకునేందుకు జగన్ సిద్ధమనే అంటారు. కానీ దానికి ఆయన ఒక వ్యూహాన్ని అవలంబిస్తున్నారు అని అంటున్నారు. ఫేక్ వీడియోవా లేక ఒరిజినల్ నా అన్నది పక్కన పెడితే జగన్ విపక్షాల మాటలకు జనాలలో విలువ ఎంత ఉందో అన్నది గమనిస్తున్నారు అని అంటున్నారు. ఒక వేళ జనాలు ఇదే నిజమని నమ్మితే మాత్రం గోరంట్ల మీద వేటు పడిపోయినట్లే.

వాస్తవానికి ఇలాంటివి ఏవీ సగటు జనాలకు ఎపుడూ పట్టవు. వారి బాధలు వారివి. ఇవి రాజకీయ విమర్శలకే పరిమితం అవుతాయి. ఈ అభిప్రాయంతోనే జగన్ ఉన్నారని అంటున్నారు. అయితే సొంత ఎంపీ మీద వేటు వేసి విపక్షాలకు రాజకీయ అడ్వాంటేజ్ ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తానికి గోరంట్లను దూరం పెట్టడం ద్వారా తన మనోగతాన్ని జగన్ వెల్లడించారు అని అంటున్నారు. మరి ఇంతటితో ఈ శిక్ష సరిపోతుందా లేక గోరంట్ల మీద కఠిన చర్యలు ఉంటాయా అంటే వెయిట్ చేయాల్సిందే.