Begin typing your search above and press return to search.
పవన్ ను బీజేపీ భయపెడుతోంది: టీడీపీ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 20 April 2023 5:00 PM GMTఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై అనేక చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన పొత్తు విషయంలో టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే.. బీజేపీ ఆయన భయపెడుతోందని హాట్ కామెంట్స్ చేశారు. పాలకొల్లులో మీడియాతో మాట్లాడిన పితాని సత్యనారాయణ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తుందని పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తెరవెనుక మాత్రం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఈ ద్వంద వైఖరి, తప్పుడు రాజకీయం మానుకోవాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రతిపాదించింది బీజేపీనే అని.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నది కూడా బీజేపీనే అని పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీతో జనసేన కలవకుండా.. బీజేపీ ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తామని ఆయన హెచ్చరించారు. టీడీపీతో కలవకుండా పవన్ కు బీజేపీ తాళం వేయాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి, దేశానికి బీజేపీ అవసరమా? అని ప్రజలు ప్రశ్నించే రోజులు రాబోతున్నాయని పితాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే టీడీపీని కూడా తమతో కలుపుకోవాలని బీజేపీ పెద్దలకు పవన్ సూచిస్తున్నారని వార్తలు వచ్చాయి.
మరోవైపు తమ పొత్తు కేవలం జనసేనతోనేనని టీడీపీతో ఉండబోదని బీజేపీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
తెలుగుదేశం పార్టీతో కలవడానికి పవన్ వస్తుంటే బీజేపీ అడ్డుకుంటోందని పితాని అంటున్నారు. పవన్ ను బీజేపీ భయపెడుతోందన్నారు. పవన్ కళ్యాణ్ ను బీజేపీ ఎంతకాలం అడ్డుకుంటుందో చూస్తామన్నారు.