Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు.. ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   19 May 2023 2:05 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు.. ఏం జ‌రిగింది?
X
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్ కు చెందిన ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు.. వార్త‌లు వ‌స్తున్నా యి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజ‌య్య‌పై ఒక‌రిద్ద‌రు మ‌హిళ‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఏకంగా సొంత పార్టీ కౌన్సిల‌ర్ ఒకామె ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చి.. ఆమె త‌న కుమార్తె వంటిద‌ని.. తాను అలాంటి వాడిని కాద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అది అక్క‌డితో స‌మ‌సిపోయింద‌ని అనుకునే స‌రికి ఇప్పుడు ఇలాంటి ఆరోప‌ణ‌లే వెల్లువెత్తాయి.

తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా యి. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు , ఫ్లెక్సీలు వెలిశాయి. అది కూడా ఏకంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ ప‌ర‌స రాల్లోనే ఏర్పాటు చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

ఆరిజ‌న్ డెయిరీ పేరుతో ఏర్ప‌డిన ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మె ల్యే చిన్న‌య్య‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌ను ఉమ‌నైజ‌ర్‌గా పేర్కొన‌డం.. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు, వార్త‌ల‌తో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి.

కామ పిశాచిగా మారిన దుర్గం చిన్న‌య్య నుంచి బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని కాపాడాల‌ని ఫ్లెక్సీల్లో పేర్కొన డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని, రోజుకో మ‌హిళ కావాలంటూ.. ఆయ‌న వేదింపుల‌కు గురి చేస్తున్నార‌ని పేర్కొనడం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. 'ఎమ్మెల్యే డ‌ర్టీ పిక్చ‌ర్‌', 'రోజు కో అమ్మాయి కావాలి' వంటి శీర్షిక‌ల‌తో స్థానిక మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌ను కూడా ఈ ప్లెక్సీల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీంతో బెల్లంప‌ల్లి ఎమ్మెల్యేల‌పై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది.

అయితే, ఇంత జ‌రుగుతున్నా.. బీఆర్ ఎస్ నేత‌ల నుంచి ఎలాంటి స్పంద‌నా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ఇదంతా త‌న‌కు కిట్ట‌ని వారు చేస్తున్న ప్ర‌చారంగా ఎమ్మెల్యే వ‌ర్గం ఆరోపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నాయ‌కుడికి టికెట్ ఇవ్వ‌కుండా కొంద‌రు కుట్ర ప‌న్నుతున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే ఇలాంటివి చేస్తున్నార‌ని వారు ఆక్షేపిస్తున్నారు. మ‌రి బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కులు ఏం చేస్తారో చూడాలి.