Begin typing your search above and press return to search.
సీబీఐ తాత్కాలిక చీఫ్ గా ప్రవీణ్ సిన్హా..
By: Tupaki Desk | 5 Feb 2021 9:45 AM ISTసీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ప్రవీణ్ సిన్హా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రవీణ్ గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం. సీబీఐ డైరెక్టర్‌గాగా ఆర్ కే శుక్లా పదవీకాలం గత బుధవారంతో ముగిసింది. దీంతో సిన్హాకు అవకాశం దక్కింది. 1983 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన శుక్లా 2019 జనవరిలో సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవికాలం పూర్తికావడంతో ప్రవీణ్ సిన్హాకు అవకాశం దక్కింది.
ప్రవీణ్ సిన్హాను తాత్కాలిక చీఫ్‌గా నియమిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీవీపీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సిన్హా కొన్ని వారాలపాటు మాత్రమే ఈ పదవిలో కొనసాగతారని సమాచారం. ఆయన 1988 బ్యాచ్ గుజరాత్ క్యాడర్‌కు చెందిన అధికారి గతంలో అనేక కీలకపదవులు నిర్వహించారు. 2015-18 మధ్య సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు అదనపు కార్యదర్శిగా సిన్హా పనిచేశారు. బాంబు పేలుళ్లు, ఆర్థిక నేరాలు వంటి కీలక కేసుల దర్యాప్తులో సిన్హా ముఖ్య పాత్ర పోషించారని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్సీ జోషి తెలిపారు.
2017లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, 2020లో సీబీఐ (క్రైమ్)ల నియమ నిబంధనలు రూపొందించడంలో ఆయన పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నియమ నిబంధనలు రూపొందించడంతో ఆయన పాత్ర కీలకం. అంతేకాక ప్రధాని మోదీకి, హోంశాఖ మంత్రికి అమిత్ షాకు అయన అత్యంత సన్నిహితుడు.