Begin typing your search above and press return to search.
ప్రముఖనటి, బీజేపీ నేత ఖుష్బూ అరెస్ట్.. తమిళనాడులో ఉద్రిక్తత
By: Tupaki Desk | 27 Oct 2020 5:00 AM GMTప్రముఖనటి, బీజేపీ నేత ఖుష్బూను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఇటీవల వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ మహిళలను కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ తిరుమాళవన్ అయోధ్య రామాలయం, దేశంలోని హిందూ దేవాలయలపై వివాదాస్పదంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ కార్యకర్తలు తిరుమాళవన్పై కోపంగా ఉన్నారు. అయితే మంగళవారం తిరుమావళవన్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఖుష్బూని ఈసీఆర్ రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈరోడ్ జిల్లాలోని గౌండంబాడి ప్రాంతంలో సోమవారం తిరుమావళవన్ కారును ముట్టడించేందుకు బీజేపీ వర్గీయులు ప్రయత్నించగా.. వీసీకే నాయకులు వారికి అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఒకరిపై మరికొరు పాదరక్షలను విసురుకున్నారు. వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు 15 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఖుష్బూ ఎంట్రీతో తమిళనాడులోని భారతీయ జనతాపార్టీ క్రియాశీలంగా మారింది. బీజేపీలో చేరిన వెంటన ఖుష్బూ కాంగ్రెస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
కాంగ్రెస్ మానసిక వికలాంగుల పార్టీ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమిళనాడులో పలు చోట్ల వికలాంగుల సంఘం ఆందోళనలు చేపట్టింది. పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఖుష్బూ అరెస్ట్ కావడం చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్రంలో బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఖుష్బూను అరెస్ట్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఖుష్బూను వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు.