Begin typing your search above and press return to search.
గోబాక్ సీఎం : విశాఖకు జగన్ కి నిరసన సెగ
By: Tupaki Desk | 15 July 2022 8:30 AM GMTవిశాఖ విమాశ్రయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి గట్టిగానే నిరసన సెగ తగిలింది. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ టీఎంటీయూసీ ఆద్వర్యంగా గో బ్యాక్ సీఎం అని ఆందోళన చేపట్టారు. ప్లా కార్డులు చేతబట్టి విమానాశ్రయం బయట ఆందోళనకారులు నిరసన చేశారు. జగన్ విశాఖ రావద్దు, గో బ్యాక్ సీఎం అంటూ వారు నినాదారు చేశారు.
సరిగ్గా సీఎం వస్తున్న టైమ్ లోనే టీఎంటీయూసీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడం నినాదాలు చేయడంతో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితిలు ఎదురయ్యాయి. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తం అయి నిసనకారులను అదుపులోకిని తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
గతంలో ఎప్పుడూ సీఎం టూర్ లో ఇలా జరగలేదు. ఆయన చాలాసార్లు ఉత్తరాంధ్రా పర్యటన కోసం విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు. కానీ ఈసారి దానికి భిన్నంగా టీఎంటీయూసీ క్యాడర్ ఆందోళన చేయడం విశేషం.
పోలీసులు కూడా వారి రాకను ముందే గుర్తించడంలో కొంత వైఫల్యం చెందారా అన్న చర్చ కూడా వస్తోంది.
ఏది ఏమైనా సీఎం గో బ్యాక్ అంటూ తెలుగుదేశం విద్యార్ధి విభాగానికి చెందిన వారు ఆందోళన చేయడం రాజకీయంగా హైలెట్ అయింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా వారు వ్యూహాత్మకంగా చేసి సక్సెస్ అయ్యారనే అంటున్నారు.
ఇక వాహనమిత్ర నాలుగువ విడత పంపిణీ కోసం జగన్ విశాఖ చేరుకున్నారు. పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.