Begin typing your search above and press return to search.
పులివెందుల టీడీపీ ఖాళీ అయినట్టే.. త్వరలోనే సతీశ్ జంప్
By: Tupaki Desk | 19 Feb 2020 9:21 AM GMTఅధికారం కోల్పోయాక తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉండలేకపోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుంటే తమ భవిష్యత్ ఉండదని ఆ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీ నాయకులు రాజకీయంగా కనుమరుగు కావడమో లేదా ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు పార్టీలోని కీలక నాయకుడు సతీశ్ కుమార్ రెడ్డి త్వరలోనే పార్టీ వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన వెళ్లితే ఇక పులివెందులలో ఆ పార్టీ కనుమరుగైనట్టే.
పులివెందుల నియోజకవర్గమంటే వైఎస్సార్ కుటుంబమే గుర్తొస్తది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాకాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సతీశ్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో కీలక నేతగా ఉన్న సతీశ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు గుడ్‌బై చెబుతున్నారనే ప్రచారం జోరందుకుంది. కొద్ది రోజులుగా ఆయన పార్టీ అధిష్టానం పై అసంతృప్తి తో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ పై 2014, 2019లో సతీశ్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి పరాజయం పొందారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడం తో చంద్రబాబు సతీశ్ రెడ్డికి ఎమ్మెల్సీ తో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పదవులిచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసింది. అయితే మళ్లీ అవకాశం ఇస్తారేమనుకుంటే సతీశ్ కు రెండోసారి ఎమ్మెల్సీని చేయలేదు. ఆ క్రమంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవికి చంద్రబాబు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి పార్టీ తీరు పై అహసనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పార్టీ అధినేత చంద్రబాబుతో సతీశ్ కుమార్ రెడ్డికి సఖ్యతగానే ఉంటున్నా ఆయన పుత్రరత్నం లోకేశ్ వ్యవహార శైలితో సతీశ్ విసిగి పోయారని, పైగా పార్టీలో పరిస్థితులు నచ్చక తెలుగుదేశం వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే టీడీపీని సతీశ్ రెడ్డి వీడే అవకాశం ఉంది. అయితే సతీశ్ పార్టీ వీడితే పులివెందులలో ఆ పార్టీకి పెద్ద దిక్కు కోల్పోయే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయిందన్న కారణంగానే ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడి పోయిందంటున్నారు. వైఎస్సార్సీపీ లో చేరాలనుకుంటున్న సతీశ్ కుమార్ రెడ్డి అంశం పై టీడీపీ నాయకులు స్పందిస్తూ సతీశ్ రెడ్డి చేపట్టిన కాంట్రాక్టు పనుల బిల్లుల కోసమే అధికార పార్టీ లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.