Begin typing your search above and press return to search.

పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్.. చదివింపుల కోసం సరికొత్త ఆలోచన

By:  Tupaki Desk   |   19 Jan 2021 8:46 AM GMT
పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్.. చదివింపుల కోసం సరికొత్త ఆలోచన
X
టెక్నాలజీ వాడుకోవాలే కానీ , చాలా ఉపయోగాలు ఉన్నాయి. టెక్నాలజీ ద్వారా పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దీనితో ప్రతి ఓక్కరూ కూడా టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత క్షణాల్లోనే బ్యాంకు లావాదేవీలు చేసుకునే వీలు కలిగింది. గూగుల్ పే, ఫోన్‌పే వంటి పేమెంట్ యాప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సదుపాయాలను ఉపయోగించి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం మనకు తెలిసిందే.

తాజాగా QR కోడ్ ఆలోచనతో పెళ్లి చదివింపుల ప్రక్రియను సులభతరం చేసింది ఒక జంట. తమిళనాడులోని మదురైలో జరిగిన పెళ్లి కోసం వధూవరులు వినూత్నంగా ఆలోచించారు. వెడ్డింగ్ కార్డుపై గూగుల్ పే, ఫోన్ పే QR కోడ్‌లను ముద్రించి ఆహ్వానితులకు అందించారు. పెళ్లికి వచ్చేవారు, ఇతర కారణాలతో రాలేకపోయినవారు ఇన్విటేషన్ కార్డుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ ద్వారా వధూవరుల అకౌంట్‌ కు డబ్బు ట్రాన్స్ ‌ఫర్ చేయవచ్చని చెప్పారు. ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు ఇంటర్నెట్‌ లో వైరల్ అవుతోంది.

కరోనా తరువాత పెళ్లి, ఇతర ఫంక్షలను ఆన్‌ లైన్ టెక్నాలజీ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం ట్రెండింగ్‌ గా మారింది. ఇలాంటి ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత నెలలో పెళ్లి చేసుకున్న ఒక జంట కార్యక్రమాన్ని ఆన్‌ లైన్‌ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. వారి బంధువులు, స్నేహితుల ఇళ్లకే పెళ్లి విందు భోజనాన్ని పంపించారు. తాజాగా క్యూఆర్ కోడ్ చదివింపుల గురించి తనకు చాలా కాల్స్ వస్తున్నాయని పెళ్లికూతురు తల్లి జయంతి చెప్పారు. అయితే పెళ్లికి వ‌చ్చిన 30 మంది అతిథులు ఈ స‌దుపాయాన్ని వినియోగించుకున్నారు. వెడ్డింగ్ ప్ర‌జెంట్‌ గా న‌గ‌దు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్‌ ల‌ను వాడుకున్నారు. ఆదివారం ఈ పెళ్లి వేడుక జ‌రిగింది.