Begin typing your search above and press return to search.
బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన రియల్ క్వీన్
By: Tupaki Desk | 31 Aug 2019 4:44 AM GMTఅందానికి పరిమితులు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఒక అందానికి మించిన మరో అందం ప్రపంచంలో కనిపిస్తూనే ఉంటుంది. శారీరక అందం అందరూ చెప్పేదే.. చర్చించేదే. కానీ.. శారీరక అందంతో పాటు.. మానసిక అందం ఉన్నోళ్లు చాలా తక్కువమంది కనిపిస్తారు. అందునా.. ప్రముఖుల్లో ఇలాంటి కాంబినేషన్ కాస్త రేర్ అనే చెప్పాలి. చెప్పలేనంత సంపద.. అంతకు మించిన పేరుప్రఖ్యాతుల కాంబినేషన్ ఓకే. కానీ.. దీనికి తిరుగులేని అధికారం అనేది అదనంగా చేరిన తర్వాత కూడా నిరుపేదల గురించి.. బాధితుల గురించి.. పరాజితుల గురించి ఆలోచించటం.. వారికి అండగా నిలవటం.. వారి కోసం గళాన్ని విప్పే వారు చాలా తక్కువమందే ఉంటారు. అలాంటి కోవకే చెందుతారు జోర్డాన్ రాజు అల్ అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ సతీమణి క్వీన్ రానియా.
సాధారణ కుటుంబం నుంచి అనూహ్యంగా రాజవంశంలోకి అడుగుపెట్టిన ఆమె.. అందానికి అందమే కాదు.. అంతకు మించిన ఆందమైన మనసు ఆమె సొంతంగా చెబుతారు. కువైట్ లో పుట్టిన రానియా అమెరికాలోని వర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత సిటీ బ్యాంకులోని మార్కెటింగ్ జాబ్ చేసిన ఆమె.. తర్వాత జోర్డాన్ రాజధాని అమ్మాన్ లో ఆపిల్ కంపెనీలో జాబ్ చేరారు.
ఒక పార్టీలో జోర్డాన్ యువరాజు అల్ అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ తో ఆమెకు పరిచయం జరిగింది. ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టటం.. అది పెరిగి పెద్దది కావటమే కాదు.. 1993లో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పటికి రాజుగా ఉన్న హుస్సేన్ 1999లో మరణించిన తర్వాత.. రానియా భర్త దేశానికి రాజు అయ్యారు.
జోర్డాన్ రాణి అయ్యాక ఆమె చేస్తున్న కార్యకలాపాలు ఆమెకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావటమే కాదు.. ఎంతో అందమైన ఆమెకు.. మరీ ఇంత అందమైన మనసు ఉండటంపై తరచూ ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. మధ్య ఆసియా దేశాల నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లే వారి విషయంలో దయతో వ్యవహరించాలంటూ ఆమె కోరుతుంటారు. అంతేకాదు.. యుద్ధాల కారణంగా సర్వం కోల్పోయి వారిని అక్కున చేర్చుకొని ఆదరించేలా ఏర్పాట్లు చేస్తుంటారు.
చిన్నపిల్లల సైకాలజీ మీద పుస్తకాలు రాసే ఆమెలో మరో ఆసక్తికర కోణం ఉంది. మీరింత అందంగా ఉంటారు? మీ బ్యూటీ సీక్రెట్ ఏమిటంటే.. మన హీరోయిన్ల మాదిరి కాకుండా.. ఆమె చెప్పే సమాధానం ఆసక్తికరంగా ఉంటుంది. తన అందానికి రహస్యం చాక్లెట్లుగా చెబుతారు. తనకున్న ఇష్టాన్ని ఓపెన్ గా చెప్పేయటమేకాదు.. ఆ చాక్లెట్ క్వీన్ కు 49 ఏళ్లు అంటే ఎవరూ నమ్మరంటే నమ్మరని చెప్పక తప్పదు.