Begin typing your search above and press return to search.

ఆర్ బీఐ లేటెస్టు రిపోర్టు.. అప్పుల ఊబిలో ఫ్యామిలీలు

By:  Tupaki Desk   |   22 March 2021 3:11 AM GMT
ఆర్ బీఐ లేటెస్టు రిపోర్టు.. అప్పుల ఊబిలో ఫ్యామిలీలు
X
మాయదారి కరోనా మన దేశంలోకి అడుగు పెట్టి ఏడాదికిపైనే అవుతోంది. లాక్ డౌన్ విధింపు నేటికి ఏడాది. అప్పటివరకు మాంచి స్పీడ్ లో వెళుతున్న టూవీలర్ ను ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తే.. ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. ఇంచుమించే అలాంటి పరిస్థితే ప్రతిఒక్కరిది. తెలీని భయం.. ఆందోళన.. అంతకు మించిన అనుభవం లేని లాక్ డౌన్.. ప్రభుత్వ పరిమితుల నడుమ ఉద్యోగాల్లో కోత విధించటం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలానే సమస్యల్ని అనుభవించారు ప్రజలు. ఇలాంటి సమస్యలతో పాటు.. ఆర్థిక ఇబ్బందుల్ని ఎంతలా ఎదుర్కొన్నారన్న విషయాన్ని కళ్లకు కట్టేలా వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కుటుంబాల అప్పులు పెరిగినట్లుగా పేర్కొంది. గతంతో పోలిస్తే.. పొదుపు రేటు తగ్గి.. కుటుంబాల అప్పులు జీడీపీలో 37.1 శాతానికి పెరిగినట్లుగా చెప్పింది. కోవిడ్ 19 కారణంగా లక్షల మంది ఉద్యోగాలు గల్లంతు కావటం.. వేతన జీవుల జీతాల్లో కోతలు పడటంతో ఇంటి అవసరాల కోసం అప్పులు చేయటం.. పొదుపును తగ్గించుకున్నట్లుగా తేల్చింది.

2020-21 మొదటి త్రైమాసికంలో కుటుంబాల పొదుపు రేటు జీడీపీలో 21 శాతం ఉంటే.. రెండో త్రైమాసికంలో 10.4 శాతానికి పరిమితమైంది. సాధారణంగా వ్రద్ధి రేటు నిలిచినా.. క్షీణించినా కుటుంబాల పొదుపు రేటు పెరుగుతుందని.. అందుకు భిన్నంగా మొదటి త్రైమాసికంలో 23.9 శాతం తగ్గితే.. పొదుపు రేటు 21 శాతానికి దూసుకెళ్లింది. రెండో త్రైమాసికంలో వ్రద్ధి క్షీణత 7.5 శాతానికి పరిమితం కాగా.. పొదుపు రేటు 10.4 శాతానికి తగ్గిందని వెల్లడించింది. కరోనా కారణంగా కుటుంబాల డిపాజిట్లు.. అప్పులు పెరగ్గా.. వారి చేతిలో నగదు నిల్వలు.. పెట్టుబడులు తగ్గిన విషయాన్ని వెల్లడించింది.