Begin typing your search above and press return to search.

బాస్ వచ్చే..గెలుపొచ్చే..ఉత్కంఠ పోరులో పంజాబ్ విన్

By:  Tupaki Desk   |   16 Oct 2020 3:45 AM GMT
బాస్ వచ్చే..గెలుపొచ్చే..ఉత్కంఠ పోరులో పంజాబ్ విన్
X
హమ్మయ్య.. ఎట్టకేలకు పంజాబ్ ఓటములకుబ్రేక్ పడింది.ఏకంగా ఎనిమిది మ్యాచ్ ల తర్వాత విజయం అందుకుంది. కెప్టెన్ రాహుల్ తో పాటు ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న క్రిస్ గేల్ తన స్టయిల్ కి భిన్నంగా క్రీజులో కుదురుకుపోయి అర్ధ సెంచరీతో విజయం అందించాడు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో విన్ మాత్రం పంజాబ్ కు దక్కింది.చివరి బంతికి విజయం సాధించింది.ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ కి శుభారంభం లభించలేదు. అరోన్‌ఫించ్‌(20), దేవదూత్‌ పడిక్కల్‌(18), ఏబీ డివిలియర్స్‌(2) విఫలం విఫలం అయ్యారు.ఈ పరిస్థితుల్లో కోహ్లి ఆచి తూచి ఆడుతూ (48; 39 బంతుల్లో 3ఫోర్లు) జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. శివం దూబే(23; 19 బంతుల్లో 2 సిక్స్‌)లు, చివర్లో క్రిస్‌ మోరిస్‌(25 నాటౌట్‌; 8 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) మెరుపులతో బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఛేదనలో గేల్‌ 53(45 బంతుల్లో,( 1 ఫోర్‌, 5 సిక్స్‌లు ), కేఎల్‌ రాహుల్‌(61 నాటౌట్‌; 49 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు) మరోసారి రాణించడంతో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించింది. కింగ్స్‌పంజాబ్‌ జట్టులో మయాంక్‌ అగర్వాల్‌(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. ఆ తర్వాత గేల్‌, రాహుల్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ఆడారు.

ఆఖర్లో హైడ్రామా

చహల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ నెలకొంది.
ఆ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్‌ తొలి నాలుగు బంతులకు పరుగు ఒక్క పరుగే ఇచ్చాడు. ఐదో బంతికి గేల్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ థ్రిల్లర్ గా మారింది. ఈ పరిస్థితుల్లో పూరన్‌ సిక్స్‌ కొట్టి పంజాబ్ కు విజయం కట్టబెట్టాడు. ఈ సీజన్‌ లో ఆర్సీబీ తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబే గెలుపొందింది. ఈ సీజన్లో ఆర్సీబీ కి మూడో ఓటమి.

ఓడినా విరాట్ రికార్డులు

బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్‌ ఓడిపోయినా రెండు రికార్డ్‌లను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరీర్‌ లో 200వ మ్యాచ్‌. కోహ్లీ బ్యాటింగ్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని రికార్డును కూడా బద్దలు కొట్టాడు. కెప్టెన్ గా విరాట్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

గేల్.. జిగేల్

ఐపీఎల్లో ఎన్నో జట్ల తరపున మ్యాచ్ లు ఆడిన గేల్ ఒక్క మ్యాచ్ ఆడటానికి సీజన్లో ఎప్పుడూ ఇన్ని రోజులు బ్రేక్ తీసుకోలేదు. పంజాబ్ ఎందుకో అతడిని పక్కన పెట్టింది. ఎట్టకేలకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనుకున్నాడేమో..గేల్ తన దూకుడు తగ్గించి నెమ్మదిగా ఆడాడు.చివర్లో రన్ రేట్ అవసరం అయిన వేళ సిక్సులు బాది జట్టుకు విజయం అందించాడు.