Begin typing your search above and press return to search.
సూపర్ ఓవర్.. సూపర్ ఇంట్రెస్ట్ !
By: Tupaki Desk | 29 Sep 2020 4:30 AM GMTఈ సీజన్ అసలు జనాలే లేకుండా దుబాయ్ లో మ్యాచ్ లు నిర్వహిస్తుండగా చాలా చప్పగా సాగుతున్నాయి. ఆ తర్వాత మ్యాచ్ లు కూడా అంత థ్రిల్లింగ్ గా లేక పోవడం తో ఫాన్స్ నిరాశ లో కూరుకు పోయారు. ఈ దశలో భారీ స్కోర్ల పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్ కాస్త ఊపు తీసుకురాగా సోమవారం రాత్రి బెంగళూరు ముంబై మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్ కు దారితీయడంతో చివరికి బెంగళూరు ను విజయం వరించింది. నికార్సయిన థ్రిల్లర్ అంటే ఇదే. ఐపీఎల్ తాజా సీజన్ లో మరో మహాద్భుతమైన సూపర్ ఓవర్ పోరు. ఇరు జట్లలోని స్టార్ హిట్టర్లు బౌండరీలు, సిక్సర్ల తో హోరెత్తించారు. 202 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన ముంబై 15వ ఓవర్‌కు కానీ వంద పరుగులు చేయలేకపోయింది. ఇక ముంబై కి ఓటమి ఖాయం అనుకోగా అనూహ్యంగా ఇషాన్ కిషన్ చెలరేగాడు. అతడికి పొలార్డ్ సుడిగాలిలా తోడయ్యాడు. ఓవర్ కు 18 పరుగుల రన్ రేట్ తో పరుగులు అందించారు. చివరికి మ్యాచ్ టై అయ్యింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫించ్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), దేవ్‌దత్ పాడిక్కల్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి ప్రదర్శన చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కచ్చితంగా 201 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయ్యింది. ఇషాన్ కిషన్ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీకి దూరమైనా భారీ సిక్స్‌లతో విరుచుకు పడ్డాడు. పొలార్డ్ 24 బంతుల్లో 60 ( 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) కొట్టేయడంతో మ్యాచ్ సమం అయ్యింది.
సూపర్ ఓవర్ ఇలా
సూపర్ ఓవర్ లో ముందు ముంబై బ్యాటింగ్ చేయగా బెంగళూరు బౌలర్ నవదీప్ షైనీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు డివిలియర్స్ 2 ఫోర్లు కొట్టడంతో సూపర్ విక్టరీ సాధించింది.
కొంపముంచిన రోహిత్ నిర్ణయం
మ్యాచ్ ఓటమి ఖాయం అనుకున్న సమయంలో ఇషాన్ కిషన్, పోలార్డ్ తమ అసమాన పోరాటంతో టైం వరకు తీసుకు వచ్చినా సూపర్ ఓవర్ లో రోహిత్ తీసుకున్న నిర్ణయం ఓటమికి కారణమైంది. రోహిత్ అప్పటికే ధాటిగా ఆడుతున్న ఇషాన్ కిషన్ కు బదులుగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ దింపాడు. ఆ నిర్ణయమే ముంబై కొంపముంచింది. ఇషాన్ కిషన్ భారీ ఇన్నింగ్స్ ఆడి అలసిపోయిన కారణంగానే భారీ షాట్లు ఆడగల పాండ్య బ్యాటింగ్ కు పంపినట్లు రోహిత్ వివరణ ఇచ్చాడు.
మ్యాచ్ లో మరిన్ని హైలెట్స్
* టై అయిన మ్యాచ్‌లో అత్యధిక స్కోరు (201) నమోదవడం ఇదే తొలిసారి.
* బుమ్రా వేసిన సూపర్ ఓవర్‌లో మ్యాచ్ (భారత్/ముంబై తరఫున) ఓడడం ఇదే తొలిసారి.
* ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు (99) చేసిన మూడో అన్‌క్యాప్ డ్ భారత ఆటగాడు ఇషాన్ కిషనే. గతంలో పాల్ వాల్థాటి (120 నాటౌట్), మనీశ్ పాండే (114 నాటౌట్) ఉన్నారు.
* కోహ్లీ మరో సారి విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్ లో కూడా కేవలం మూడు పరుగులే చేశాడు. ఐపీఎల్ లో వరుసగా ఇలా విఫలం కావడం ఇదే తొలిసారి.
* బెంగళూరు ఓపెనర్ కొత్త కుర్రాడు పాడిక్కాల్ మరోసారి చక్కటి ప్రదర్శన చేసి అర్ధ సెంచరీ చేశాడు.
* బెంగళూరు బ్యాట్స్మెన్ డివిలియర్స్ ఈ మ్యాచ్ తో ఫామ్ అందుకున్నాడు. తన సొగసరి బ్యాటింగ్ తో మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ ని అలరిస్తూ అర్థ సెంచరీ నమోదు చేశాడు.
* బెంగళూరు ఆటగాడు వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్లకు కేవలం 12 పరుగులు చేసి ఒక వికెట్ తీసి ఎకానమీ రేట్ 3.00గా నమోదు చేశాడు. కుంబ్లే సరసన నిలిచాడు.