Begin typing your search above and press return to search.
ఆర్ ఎస్ ఎస్ క్యాడర్ బీజేపీ ఆకర్షణలో పడుతోందా ...
By: Tupaki Desk | 22 Feb 2020 3:30 AM GMTరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ , బీజేపీ పేరుకే రెండు పార్టీలు అయినప్పటికీ , ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నా కూడా బీజేపీ అన్నా ఒక్కటే అన్నటుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే గోలీమారో, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లాంటి నినాదాలు రాష్ట్రీయ స్వయం ఆర్ ఎస్ ఎస్ ను తీవ్రంగా బాధించాయా, రాష్ట్రాలలో బీజేపీ వరుస ఓటముల పై సంఘ్‌లోనూ విశ్లేషణలు మొదలయ్యాయా, సంఘ్ కేడర్ క్రమంగా బీజేపీ వెళుతోందన్న భయం సంఘ్‌ను పట్టుకుందా? అంటే ప్రస్తుత పరిస్థులని బట్టి చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తుంది.
మొదట్లో సామాజిక ఉద్యమంగా ఆరెస్సెస్ వేళ్లూనుకుంది. క్రమంగా రాజకీయాలకు, భావసారూప్య పార్టీలకు దగ్గరకావడం ఇప్పుడు ఇబ్బంది కరంగా మారింది. నిన్నటి దాకా బీజేపీ కి సైద్ధాంతిక మాతృకగా ఉన్న సంఘ్, కానీ, ప్రస్తుతం పునరాలోచనలో పడింది.హిందుత్వ పేరుతో బీజేపీ ఓట్లు దండుకున్నా, ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారాయని సాక్షాత్తూ సరసంఘ చాలక్ మోహన్ భగవత్, సర్‌కార్యవాహ భయ్యాజీ జోషి అంగీకరిస్తున్నారు. హిందుత్వం తమ పేటెంట్ కాదని, అందులో కేడర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఆర్ ఎస్ ఎస్ కు, బీజేపీకి హిందుత్వ లింక్ ఉన్నాసరే, కొందరు ఆరెస్సెస్ ప్రచారకులను బీజేపీ సేవలకు పంపినంత మాత్రాన పూర్తిగా ఆరెస్సెస్ అంటే బీజేపీ, బీజేపీ అంటే ఆరెస్సెస్ అన్న భావన ఆమోదయోగ్యం కాదని సంఘ్ పెద్దలు కుండబద్దలు కొడుతున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎంతసేపూ మోదీ, షా చుట్టే తిరుగుతోందని, వ్యక్తి పూజతో బీజేపీతో పాటు సంఘ్ కు కూడా ఇబ్బందిగా మారిందని అంటున్నారు. బీజేపీ, సంఘ్ రెండూ ఒకటే అని సగటు ఓటరులో నాటుకుపోవడం, స్వయం సేవకులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపడం సంఘ్ జీర్ణించుకోలేకపోతోంది. అవసరం కోసం ఒకరిద్దరు ప్రచారకులని పంపిన మాత్రాన మొత్తంగా బీజేపీని సమర్థించడం సహేతుకం కాదని కొందరు చెప్తున్నారు.