Begin typing your search above and press return to search.
వైఎస్ అవినాష్ అరెస్టు తప్పదు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 26 April 2023 1:06 PM GMTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదన్నారు. అరెస్టు అయినప్పటికీ ఆయన బెయిల్ పై వస్తారని వ్యాఖ్యానించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసులో అనవసరంగా ఇరికించారని ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు.
కడపలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ అవినాష్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌తో రెడ్డి పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. అవినాష్ ను సీబీఐ అరెస్ట్ చేస్తే ఎలా ముందుకెళ్లాలనేదానిపై సమావేశంలో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది.
అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని రాచమల్లు వ్యాఖ్యానించారు. అరెస్టయినా ఆయన బెయిల్‌పై బయటకు వస్తారన్నారు. ఈ కేసులో చంద్రబాబు వెనకుండి కుట్ర చేసి అవినాష్ ను ఇరికించే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపించరని మనసాక్షిగా తాను నమ్ముతున్నానన్నారు. మొదటి నుంచీ తాను ఇదే చెబుతున్నానన్నారు. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని తెలిపారు. హత్యలో అవినాష్ పాత్ర ఉందని రుజువైతే తాను రాజకీయాల్లో ఉండనని చెప్పానని గుర్తు చేశారు. నిందితుడిగా చేరిస్తే రాజీనామా చేస్తానని చెప్పలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వెల్లడించారు. న్యాయస్థానంలో ఆ విషయం రుజువైతే రాజీనామా చేస్తాననే మాటకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
కాగా ఇటీవల వైఎస్ అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నల్ల దుస్తులు ధరించి ప్రొద్దుటూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏ పాపం తెలియని అమాయకుడైన భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. భాస్కరరెడ్డి అరెస్టును ఖండిస్తూ వైసీపీ శ్రేణులతో ప్రొద్దుటూరులో భారీ ర్యాలీని నిర్వహించారు.
ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అవినాష్ అరెస్టు తప్పదని తేలిపోయినట్టేనని.. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతల సమావేశంలో అవినాష్ వివరించి ఉంటారని చెబుతున్నారు.