Begin typing your search above and press return to search.
సమతామూర్తి విగ్రహ వివాదం...రాహుల్ గాంధీకి ఈ మాత్రం తెలియదా?
By: Tupaki Desk | 9 Feb 2022 5:30 PM GMTముచ్చింతల్‌లో కొలువుదీరిన శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహం విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 'మేడిన్ ఇన్ చైనా' అంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కొత్త చర్చకు తెరలేపింది. అయితే, ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సమతామూర్తి విగ్రహం విషయంలో రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకోవాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను తప్పుబట్టిన కిషన్ రెడ్డి.. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ'కి సంబంధించి నాలుగు అంశాలతో కూడిన వివరాలతో కౌంటర్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రిందట ప్రైవేటు ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌గా 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' అనే ప్రాజెక్ట్ మొదలైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' ప్రాజెక్ట్‌కు పూర్తిగా(100 శాతం) ప్రైవేటు ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చినవేనని.. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్ధిక సహాయాన్ని అందించలేదని స్పష్టం చేశారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఆత్మనిర్భర్ భారత్' పిలుపు విషయంలో సెటైర్లు వేయడాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ ఆత్మనిర్భర్ భారత్ కంటే ముందే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' ప్రాజెక్ట్‌పై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్.. కేవలం ఆయన అజ్ఞానాన్ని చాటుకుందని ఎద్దేవా చేశారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా.. కేవలం కల్లబొల్లి కబుర్లు చెబుతూ తన పార్టీని తానే మట్టికరిపిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. గతంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో MOU కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్ చేశారు.