Begin typing your search above and press return to search.
మనసు కరగదా రాహుల్ జీ...మరీ అంత వైరాగ్యమా...?
By: Tupaki Desk | 19 Sep 2022 5:31 AM GMTరాహుల్ గాంధీ చిత్రమైన నాయకుడు అనే చెప్పాలి. ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఆయనకు చాలా మంది నాయకుల్లా పదవుల మీద ఆశ అయితే లేదు అనే చెప్పాలి. ఉంటే కనుక మరో మాట లేకుండా 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల పాటు సాగిన యూపీయే వన్ టూ సర్కార్లలో ఏదో ఒక దానికి నాయకత్వం వహించి ప్రధాని అయిపోయేవారు. ఇక 2004లో అపుడే రాజకీయ ఎంట్రీ ఇచ్చారు అనుకున్నా 2009 తరువాత అయినా కుర్చీ ఎక్కేసేవారే.
ఇప్పటి వారసులను చూస్తూంటే డైరెక్ట్ గానే మినిష్టర్ కుర్చీ పట్టేస్తున్నారు. కానీ రాహుల్ మాత్రం తాను అలా సీటెక్కకుండా పక్కనే ఉండిపోయారు. కాబట్టే మన్మోహన్ సింగ్ పదేళ్ళ పాటు ఏలగలిగారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పీఠం పైన ఆసీనుడు కావాలని సోనియా గాంధీ 2013 నుంచి బతిమాలుతూనే ఉన్నా ఆయన 2018 దాకా ఓకే చెప్పలేదు. తీరా ప్రెసిడెంట్ కిరీటం పెట్టించుకున్నాక ఆరు నెలలకే దానికి రాజీనామా చేసేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడింది అని బాధ్యత వహించారు.
ఇప్పటికి మూడున్నరేళ్ళు అయినా రాహుల్ ప్రెసిడెంట్ కుర్చీ వైపు పోవడంలేదు. అక్టోబర్ 17న కాంగ్రెస్ ఎన్నికలు ఉన్నాయి. దాంతో దేశంలోని కాంగ్రెస్ నాయకత్వం అంతా రాహుల్ జీ మీరే మా అధ్యక్షులు అని వేయి గొంతుకలతో కోరుతోంది. మీరుండాల్సిందే అని కూడా విన్నపాలు పంపుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ రాహుల్ అధ్యక్ష పీఠం ఎక్కాలని తీర్మానం ఆమోదిస్తే ఇపుడు చత్తీస్ ఘడ్ కూడా అదే బాటన నడిచింది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇలాగే కోరుతున్నాయి.
రాహుల్ మాత్రం కాళ్ళకు బలపాలు కట్టుకుని పాదయాత్రలో నిండా మునిగారు. ఈ విషయం మీద మీడియా ప్రశ్నలు వేసిన నా డెసిషన్ ఆల్ రెడీ తీసేసుకున్నాను. అదేంటి అన్నది ఎన్నికల వేళ మీకే తెలుస్తుంది అని సస్పెన్స్ లో పెట్టారు. రాహుల్ మాటలను బట్టి చూస్తే సీనియర్ నేతను ఒకరిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నారుట. తాను మాత్రం కాంగ్రెస్ అగ్ర నేతగానే కొనసాలని చూస్తున్నారు అని అంటున్నారు.
అంటే పిలిచి కిరీటం పెడతామని కోరినా నా కొద్దీ పదవులు అంటున్నారు ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వారసుడు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పెళ్ళి అన్నా కూడా నో అనే చెబుతారు.
అందగాడు, అతి పెద్ద కుటుంబానికి చెందిన ఆయన పెళ్ళికి తాను చాలా దూరమనే తోసిపుచ్చుతారు. మనకు ఒక సామెత ఉంది. కీర్తికి కాంతకు కనకానికి పడని వారు ఎవరూ ఉండరని, కానీ రాహుల్ మాత్రం అది తప్పు అనే చెబుతున్నారు. ఆయన ఒక విధంగా రాజకీయాల్లో ఉన్న ఆధునిక మహర్షిగా ఒక్కోసారి కనిపిస్తారు అంటే ఆలోచించాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.