Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ క్లారిటీ...ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను

By:  Tupaki Desk   |   10 March 2019 11:56 AM GMT
ర‌జ‌నీ క్లారిటీ...ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కొన్నాళ్ళ క్రితం తాను రాజ‌కీయాల‌లోకి అడుగుపెడుతున్న‌ట్టు ర‌జ‌నీ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న పార్టీ పేరు ప్ర‌క‌టించ‌ని ర‌జ‌నీకాంత్ రానున్న లోక్‌ స‌భ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తాడా లేదా అనే దానిపై అభిమానుల‌లో ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేయ‌న‌ని, ఏ పార్టీకి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌క‌టించారు. అయితే, తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న కూడా చేశారు. తమిళనాడులో రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు.

చెన్నై ఎయిర్‌ పోర్టులో రజనీకాంత్‌ ను ఎన్నికల పోటీ విషయమై రిపోర్టర్లు ప్రశ్నించారు. రజనీ స్పందిస్తూ..తమిళనాడులో నీటి సంక్షోభం నివారణ కోసం ఎవరైతే చిత్తశుద్ధితో కృషి చేస్తారో..ప్రజలు వారికే ఓటేయాలని రజనీ పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని..అసెంబ్లీ ఎన్నికలే తమ లక్షమని రజనీకాంత్‌ ఇటీవలే స్పష్టం చేశారు. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ అనే తన అభిమాన సంఘం పేరుతో రాజకీయ కార్యక్రమాలు జరుపుతున్న వారెవరూ..వేరే ఏ పార్టీ కోసం, ప్రచారం కోసం తన ఫొటోను ఉపయోగించొద్దని ఇప్పటికే కోరారు. ర‌జనీకాంత్ మాత్రం ఇప్ప‌టికి పార్టీ పేరు, కార్యాచ‌ర‌ణ‌ని ప్ర‌క‌టించ‌ని విషయం తెలిసిందే.

ర‌జనీ త‌న పార్టీకి ‘రజనీకాంత్ మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్ట‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఏడాది న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ర‌జనీకాంత్ డిసెంబ‌ర్ 12,2018న త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా పార్టీ పేరు ప్ర‌క‌టిస్తాడ‌ని అనుకున్న ఇప్పటి వ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు. ఇంకా పార్టీకి సంబంధించి ముమ్మ‌రంగా ప‌నులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో పార్టీ పేరు ప్ర‌క‌టించ‌డంలో జాప్యం జ‌రుగుతుంద‌ని అంటున్నారు.