Begin typing your search above and press return to search.

దొంగలు ఆ మొక్కను ఎందుకు దొంగలించారు?

By:  Tupaki Desk   |   16 Jan 2021 5:44 AM GMT
దొంగలు ఆ మొక్కను ఎందుకు దొంగలించారు?
X
ఇప్పటివరకు మనుషుల్ని కిడ్నాప్ చేయటం.. బంగారం.. వజ్రాలు.. నగదు లాంటి వాటిని చోరీ చేయటం విన్నాం. మరికొందరు చిల్లర దొంగలు.. బక్కెట్లు.. బిందెలు.. రాగి వైర్లు లాంటివి చోరీ చేయటం తెలిసిందే. ఇక.. కోళ్లు.. కుక్కలు.. మేకల్ని దొంగలించటం తెలిసిందే. అందుకు భిన్నంగా గతంలో ఎప్పుడూ లేని రీతిలో తాజాగా ఒక మొక్కను దొంగలించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్ మహానగరంలో మొక్కను దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని ప్రత్యేకత ఏమిటన్న వివరాల్లోకి వెళితే.. ఆశ్చర్యపోవాల్సిందే. సీనియర్ ఐపీఎస్ అధికారి.. రిటైర్డు డీజీపీ అప్పారావు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్న ఒక మొక్కను తాజాగా దొంగలు దొంగలించారు. దీనికికారణంగా.. ఆ మొక్క విలువ రూ.1.5లక్షలు కావటమే. అంత ఖరీదైన బొన్సాయి మొక్కను ఇంటి ఆవరణలో ఏర్పాటు చేశారు.

రోజువారీగా నీళ్లు పోసే తోటమాలి.. విలువైన మొక్క మిస్ కావటం గుర్తించి.. యజమానికి సమాచారం అందించారు. దీంతో.. ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమేరాల సాయంతో మొక్కను దొంగలించిన ఇద్దరిని అరెస్టుచేశారు. వారి నుంచి విలువైన బొన్సాయ్ మొక్కను స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగలకు మొక్క విలువ గురించి తెలీటంతో.. అర్థరాత్రి సమయంలో వచ్చి చోరీ చేసినట్లుగా గుర్తించారు. మొత్తానికి మొక్కల్ని దొంగతనం చేసే దొంగలు కూడా వచ్చేశారన్న మాట. సోషల్ మీడియాలో ఈ చోరీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.