Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాల లెక్కెందుకు మారింది?
By: Tupaki Desk | 5 Oct 2016 4:53 AM GMTసెన్సెక్స్ మాదిరిగా తయారైంది కొత్త జిల్లాల ఏర్పాటు యవ్వారం. అసలేం జరుగుతుందన్నది అర్థం కాని రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పండగపూట ఎవరూ బాధ పడకూడదు. కొత్త జిల్లాల ఏర్పాటులో అందరూ హ్యాపీగా ఉండాలి. అంతటా పండగ వాతావరణం వెల్లివిరవాల్సిందేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త జిల్లాల్ని స్టార్ట్ చేయటానికి పట్టుమని ఐదారు రోజుల కంటే ఎక్కువ లేని వేళ.. రోజు గడిచే కొద్ది తెరపైకి వస్తున్నకొత్త జిల్లాల ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కొత్త జిల్లాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కటువుగా ఉన్నారని.. ఆయన అనుకున్న జిల్లాలు తప్పించి.. మరి వేటిని పట్టించుకోవటం లేదన్న విమర్శ నుంచి.. కొత్త జిల్లాల ఏర్పాటు పప్పుబెల్లాల మాదిరి తయారైంది. ఎవరు ఏది అడిగితే అలా ఇచ్చేయటమేనా? అన్న విమర్శ వరకూ వచ్చింది. మొన్నటివరకూ 27 జిల్లాలుగా ఉన్న కొత్త జిల్లాలు 30గా మారటం.. ఆ తర్వాతి రోజుకే అవి 31కి చేరుకోగా.. తాజాగా మరో రెండు కొత్త జిల్లాల ప్రతిపాదన తెరపైకి వచ్చి.. మొత్తం కొత్త జిల్లాలు ‘‘33’’ అన్న సందేహానికి వస్తున్న పరిస్థితి.
ఇప్పటివరకూ ఉన్న జిల్లాలతో పాటు.. నల్గొండ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతమైన దేవరకొండ జిల్లాగా మారనుందని.. ఎందుకంటే.. ఆ జిల్లాను ఏర్పాటు చేయాలని సాక్ష్యాత్తు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రతిపాదన తెరపైకి తీసుకు రావటం.. దీంతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలతో కలిపి ఇబ్రహీంపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇలా జిల్లాల సంఖ్యను పెంచుకుంటూ పోవటమేంటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారి నోట మాట రాకుండా ఉండేలా ముఖ్యమంత్రి సెంటిమెంట్ మాట తెరపైకి రావటం గమనార్హం.
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నెంబరు ‘‘6’’ అని.. కొత్త జిల్లాల సంఖ్య ‘‘33’’ అయిన పక్షంలో రెండు మూళ్లు కలిపితే ‘ఆరు’ అవుతుందని.. అలా అయితే మరింత బాగుంటుందన్నలాజిక్ తో.. మరో రెండు కొత్త జిల్లాల ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లుగా చెబుతన్నారు. ఎంపీ కేకే నేతృత్వంలోని కొత్త జిల్లాలకు సంబంధించి ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ ఈ మధ్యన తెరపైకి వచ్చిన నాలుగు కొత్త జిల్లాలతోపాటు.. మరో రెండు కొత్త జిల్లాలపై సైతం చర్చిస్తోందని.. తామిచ్చే నివేదికలో ఈ రెండుకొత్త జిల్లాల్ని కూడా తెరపైకి తీసుకురానున్నట్లుగా చెబుతున్నారు. రోజురోజుకీ మారుతున్న జిల్లాల సంఖ్య నేపథ్యంలో కొత్త జిల్లాలకు సంబంధించిన తుది రూపునకు సంబంధించిన బోలెడంత కసరత్తు ఎప్పటికప్పుడు మారతుందని చెబుతున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మండలాల్ని సిద్ధం చేయటం.. రెవెన్యూ డివిజన్ల కేటాయింపు.. మ్యాపుల తయారీ.. ఇలా ఒకటేమిటి? చాలానే కథ ఉందని చెబుతున్నారు. మరోవైపు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా చూసుకోవటం కోసం.. కొత్త జిల్లాలకు సంబంధించిన తుది నోటిఫికేషన్ దసరా రోజునే ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే.. కొత్త జిల్లాల మీద నోటిఫికేషన్ విడుదల చేసిన రోజునే.. గంటల వ్యవధిలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయటం.. వాటిని ప్రారంభించటం లాంటివన్నీ జరిగిపోతాయన్న మాట. సినిమాటిక్ గా మారిన కొత్త జిల్లాల ఏర్పాటు యవ్వారం రానున్న రోజుల్లో మరెన్ని ఆసక్తికర మలుపులు తిరగబోతున్నదన్నది ఇప్పడు పెద్ద ప్రశ్నగా మారిందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/