Begin typing your search above and press return to search.

పొంగులేటి రాక పై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   26 Jun 2023 9:00 PM GMT
పొంగులేటి రాక పై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!
X
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం చేరికల జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార బీఆరెస్స్ కు షాకివ్వడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటునట్లు కనిపిస్తుంది. తెలంగాణ లో బీఆరెస్స్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే విషయాన్ని కన్ ఫాం చేసేపని లో పడింది. పైగా అధికార పార్టీ నుంచి సైతం కాంగ్రెస్ కు చేరికలు ఉండటంతో వారి లో ఈ వ్యవహారం మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సమయంలో ఖమ్మం జిల్లా చేరికలు, అధిష్టాణానికి లేఖలు మొదలైన విషయాల పై తాజాగా రేణుకా చౌదరి స్పందించారు.

సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే కామెంట్లు వినిపిస్తుంటాయి. వాటికి బలం చేకూరుస్తేనే ఆ పార్టీలో నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే గతకొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తెర పైకి రావడం లేదు. ఇది టి.కాంగ్రెస్ కు శుభపరిణామమే. ఈ సమయం లో ఖమ్మంలో కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో... రేణుకా చౌదరి కాస్త అలిగినట్లు కనిపించారంటూ వార్తలొచ్చాయి.

తనకు తెలియకుండా.. తనకు చెప్పకుండా.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేరికల కు ఎలా దిగుతుంది అంటూ హస్తిన కు రేణుకా చౌదరి లేఖ రాశారంటూ వార్తలొచ్చాయి! దీంతో… భట్టివిక్రమార్కతో పొంగులేటి సన్నిహితంగా ఉండటమే దీనికి కారణం అంటూ కామెంట్లు మొదలైపోయాయి. అయితే… రేణుకా చౌదరి లేఖ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టాణం ఏ మేరకు సీరియస్ గా తీసుకుందో తెలియదు కానీ... తాజాగా అబ్బే అలాంటిది ఏమీ లేదంటూ రేణుకా చౌదరి స్పందించారు!

తాజాగా మైకుల ముందుకు వచ్చిన రేణుకా చౌదరి... పొంగులేటి రాక ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారనే ప్రచారాన్ని ఆమె కొట్టి పారేశారు. పొంగులేటి రాక విష‌య‌మై తాను ఎక్కడా మాట్లాడ‌లేద‌ని చెప్పిన ఆమె... పొంగులేటి కాంగ్రెస్‌ లోకి వ‌స్తే తాను వ్యతిరేకిస్తున్నట్టు ఎవ‌రు చెప్పార‌ని ఎదురు ప్రశ్నించారు.

అయితే ఈసారి పొంగులేటి ఖమ్మం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేస్తారనే కథనాలొస్తున్న తరుణం లో... రేణుకా చౌదరి కూడా ఈసారి అసెంబ్లీ సీటుపై ఆసక్తి చూపిస్తున్నట్లు కథనాలొచ్చాయి. దీంతో... పొంగులేటి రాక తన సీటు కు గండం అని రేణుకా భావిస్తున్నారని టాక్స్ మొదలయ్యాయి. పైగా ఇప్పటికే ఖమ్మం లో రెండు వర్గాలున్నాయని అంటుంటారు. అందులో ఒకటి భట్టి విక్రమార్క వర్గం కాగా.. మరొకటి రేణుకా చౌదరి వర్గం అని అంటారు.

అయితే పొగులేటి ఈ మధ్య భట్టివిక్రమార్క ను కలిశారు.. పాదయాత్ర లో కలిసి నడిచారు.. తాను భట్టి వర్గమే అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో... ఇది రేణుకా చౌదరికి ఏమాత్రం నచ్చలేదని.. నాటి నుంచి పొంగులేటి పై గుర్రుగా ఉన్నారని ఖమ్మం కేంద్రంగా పొలిటికల్ గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో... పొంగులేటి రాక ను తాను వ్యతిరేకించడం లేదని.. కాకపొతే ఎవరు ఎక్కడినుంచి పోటీ చేస్తారనేది అధిష్టాణం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు రేణుకా చౌదరి!

ఈ సందర్భంగా పొంగులేటి, జూపల్లితో పాటు ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్‌ లో చేరితే బాగుంటుందని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డటం గమనార్హం. ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుతం హస్తిన లో రాహుల్ తో భేటీ అనంతరం స్పందించిన పొంగులేటి పార్టీలో చేరిక పై క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా... జూలై 2వ తేదీన ఖమ్మం బహిరంగ సభ లో రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని పొంగులేటి సంచలన ప్రకటన చేశారు.