Begin typing your search above and press return to search.

టీసీఎస్ కి మహిళలు గుడ్ బై.. అసలు సంగతి ఇదా?

By:  Tupaki Desk   |   13 Jun 2023 11:00 PM GMT
టీసీఎస్ కి మహిళలు గుడ్ బై.. అసలు సంగతి ఇదా?
X
కరోనా తర్వాత దేశంలో పరిస్థితులు మారిపోయాయి. చాలా మంది వర్క్ ఫ్రం ఆఫీస్ కంటే.. వర్క్ ఫ్రం హోం ను ఇష్టపడుతున్నారు. ఇప్పటికీ చాలా మంది కోరుకునేది వర్క్ ఫ్రం హోం వంటి ఉద్యోగాలే. అయితే అందులోనూ మహిళలకు ఇంటి పనితో పాటు.. అటు ఆఫీస్ పనిని ఇంటి నుంచే చేస్తున్నారు. రెండింటిని తమ చేతులతో బ్యాలెన్స్ చేస్తూ.. జీవితాన్ని గడిపిస్తున్నారు.

అయితే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒక‌టైన‌ టాటా క‌న్‌స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌ ప్రస్తుతం ఊహించని సవాలను ఎదుర్కొంటుంది. అందులో చాలా మంది మ‌హిళా ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నారు. ఇందుకు కార‌ణం టీసీఎస్ వ‌ర్క్ ఫ్రం హోం పాల‌సీని తొల‌గించ‌డ‌మేన‌ట‌. ఇటీవల ఈ సంస్థ వర్క్ ఫ్రం హోం పాలసీని తీసేసి.. అందరూ ఆఫీస్ కు రావాలని ఆదేశించింది.

దాంతో స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయిన మ‌హిళ‌లు, పెళ్లై పిల్ల‌లు ఉన్న‌వారు ఇక చేసేదేమీ లేక రాజీనామాలు చేసేస్తున్నార‌ట‌. చాలా మంది ఇంటి నుంచి వర్క్ ను అలవాటు చేసుకున్న మహిళలు... ఒక్కసారిగా ఆఫీస్ కు రమ్మంటే.. వారు రాలేకపోతున్నారు.

దీనితో చాలా మంది రాజీనామాలు చేశారు. టీసీఎస్ లో 35 శాతం మ‌హిళ‌ ఉద్యోగులే ఉన్నార‌ని... కానీ వ‌ర్క్ ఫ్రం హోం తీసేయ‌డం వ‌ల్ల వారి సంఖ్య చాలా త‌గ్గిపోయింద‌ని చీఫ్‌ హ్యూమ‌ర్ రిసోర్స్ డైరెక్ట‌ర్ మిలింద్ ల‌ఖియా తెలిపారు.

జెండ‌ర్ డైవ‌ర్సిటీ కోసం కృషి చేసే టీసీఎస్‌ లో ఇలా మ‌హిళా ఉద్యోగులు రాజీనామాలు చేయ‌డం కంపెనీకి కాస్త న‌ష్టం క‌లిగించే అంశ‌మేనని అన్నారు. మ‌హిళ‌ల కోస‌మైనా వ‌ర్క్ ఫ్రం హోం పాల‌సీని తీసుకురావాల‌ని టీసీఎస్ ఆలోచిస్తున్న‌ట్లు తెలిపారు. 2023 ఆర్ధిక సంవత్స‌రానికి గానూ టీసీఎస్ ఎంపిక‌చేసిన మ‌హిళా ఉద్యోగుల సంఖ్య 38 శాతం ఉంద‌ని పేర్కొన్నారు.

ఇప్పుడున్న 30,000 మంది సీనియ‌ర్ ఉద్యోగుల్లో 4000 మంది మ‌హిళ‌లే ఉన్నారు. ఇటీవ‌ల టీసీఎస్ రీ బిగిన్ అనే ఓ ప్రోగ్రామ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా బ్రేక్ తీసుకుని మ‌ళ్లీ ఉద్యోగం చేయాల‌నుకుంటున్న మ‌హిళ‌ల‌కు ఇదొక గొప్ప అవ‌కాశం. 2023లోనే దాదాపు 14,000 మంది మహిళ‌ల నుంచి అప్లికేష‌న్లు వ‌చ్చిన‌ట్లు సంస్థ తెలిపింది