Begin typing your search above and press return to search.
కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ వచ్చేది కాదా? ఫైర్ బ్రాండ్ ఏమన్నారంటే?
By: Tupaki Desk | 16 Jun 2023 11:00 PM GMTగొప్పలు చెప్పుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రూటు సపరేటుగా చెప్పాలి. అందరికి తెలిసిన విషయాల్ని సైతం ఆసక్తి రేకెత్తించేలా చెప్పే స్పెషల్ టాలెంట్ ఎక్కువ. ఏ అంశానికి ఎంత మసాలా దట్టించాలనన దానిపై ఆయనకున్న అవగాహన ఎంతన్నది.. ఆయనకు చెందిన చిట్టి వీడియోల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఇటీవల ఆయన సీఎం కేసీఆర్ గురించి చెప్పిన గొప్పలు విన్న వారు అవాక్కు అయ్యే పరిస్థితి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినందువల్లే తెలంగాణ వచ్చిందన్న అసాధారణ పొగడ్తను సైతం అలవోకగా చేసేశారు మంత్రి కేటీఆర్.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పుట్టక ముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్న విషయాన్ని గుర్తు చేవారు. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి అనాడు ఉద్యమానికి నాయకత్వం వహించిన వైనాన్ని గుర్తు చేశారు.
ఎన్నికలు.. కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్ పార్టీ పెట్టారని ఫైర్ అయ్యారు. తెలంగాణ జెండాను 22 ఏళ్ల పాటు మోసిన గంగాపురం రాజేందర్ కు న్యాయం జరిగిందా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.
నల్లమల అడవుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్న అభిలాషను వ్యక్తం చేసిన రేవంత్.. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోకి పలువురు నేతలు చేరటాన్ని.. కండువాలు కప్పుకోవటాన్ని తేలిగ్గా తీసుకోవద్దన్నారు.సీఎం కేసీఆర్ ఆరాచక పాలనను భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు సీఎంగా కేసీఆర్ అయిన తర్వాత..ఆరాచక పాలన చేపట్టినట్లుగా పరిస్థితులు ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు రాష్ట్రంలోని నాలుగు కోట్ల రాస్ట్ర జనాభా బలి అయినట్లుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల చైతన్య దీపికలుగా అభివర్ణించారు. మొత్తంగా పలువురు నేతలు తమతో జట్టు కట్టేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ లో చేరికలు ఏవీ కూడా గాలివాటంతో కూడినవి ఎంతమాత్రం కాదంటున్నారు మంత్రి కేటీఆర్.