Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు సవాలు విసిరి.. కవిత తప్పు చూపి.. కేసీఆర్ పై రేవంత్ పంచ్ లు
By: Tupaki Desk | 16 March 2023 9:34 PM ISTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల ఫ్యామిలీలో సీఎం కేసీఆర్ ను.. మంత్రి కేటీఆర్ ను .. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నింటికి మించి మంత్రి కేటీఆర్ కు బహిరంగ సవాలు విసిరారు. విద్యుత్.. సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు వస్తారా? అని సవాలు విసిరారు. డేట్.. టైం.. ప్లేస్ డిసైడ్ చేస్తే తాను తప్పక వస్తానని మంత్రి రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
తాజాగా పాదయాత్రలో ఉన్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని ప్రజల మధ్యనే తేల్చుకుందామన్న రేవంత్.. ఇందులో భాగంగా కేటీఆర్ కు సూటి సవాలు విసిరారు. మంత్రి కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడకు తాను చర్చకు వస్తానని వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న వైనంపైనా ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ.. బీఆర్ఎస్ ఆడే నాటకంలో భాగమే ఈడీ విచారణగా రేవంత్ అభివర్ణించారు. ''వారిద్దరిది మిత్ర బంధం. కవిత విషయంలో మీడియా హడావుడే ఎక్కువగా ఉంది. ఈ విషయం చాలా సాధారణం. లిక్కర్ స్కాం కేసులో కవిత విచారణను ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించిన సమయంలో ఎమ్మెల్సీ కవిత కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఎందుకు మాట్లాడలేదు?'' అని సూటిగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎంపీలు.. ఎమ్మెల్యేలపై తాను చేసే ఆరోపణలకు సాక్ష్యాలు.. ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపం.. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో భారీగా అవినీతి చోటు చేసుకుందున్న ఆయన.. మంత్రి ప్రశాంత్ భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే విచారణ వేసి.. తేలు స్తామన్నారు.
కాంగ్రెస్ లో గ్రూపులు లేవన్న రేవంత్.. పార్టీ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగానే పార్టీకి చెందిన కీలక నేతలంతా పాదయాత్రలు చేస్తున్నారన్నారు. భట్టి చేపట్టిన పాదయాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకోవటంతో పాటు.. ఆయన పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తే.. ఆ గ్రామాల్లో తాము ఓట్లు అడగమని.. అదే సమయంలో 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతే బీఆర్ఎస్ ఓట్లు అడగకుండా ఉంటుందా? అని సవాలు విసరటం గమనార్హం. మొత్తంగా ఒకే ప్రెస్ మీట్ లో కల్వకుంట్ల కుటుంబానికి చెందిన ముగ్గురు ముఖ్యనేతలపై రేవంత్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.