Begin typing your search above and press return to search.
తాడో పేడో.. రేవంత్ ఢీల్లీకి..
By: Tupaki Desk | 29 Sep 2019 10:43 AM GMTఈపాటికే తెలంగాణ పీసీసీ చీఫ్ కావాల్సిన నేత.. కానీ సీనియర్ల అడ్డంకులతో పోస్టు కూడా దక్కకుండా పోయిందనే ఆవేదన.. పైగా హుజూర్ నగర్ ఎన్నికల్లో తన మాట చెల్లుబాటు కాలేదు. దీంతో రగిలిపోతున్న మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తాజాగా ఇక తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఢిల్లీకి వెళ్లడం.. సోనియాగాంధీని కలువనుండడం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను హీటెక్కించింది.
కొద్దిరోజుల కిందటే తన ఫ్యామిలీతో కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి ఓ ఫొటో దిగి వచ్చారు. అప్పుడే టీపీసీసీ పగ్గాలు ఆయనకు అప్పజెప్పడానికి సోనియా రెడీ అయ్యారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది..
ఢిల్లీ నుంచి రాగానే ఇక తనే పీసీసీ చీఫ్ అని రేవంత్ దూకుడు ప్రదర్శించారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ భార్య పద్మావతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. కొత్త అభ్యర్థిని ప్రకటించారు. కానీ సీనియర్లంతా ఉత్తమ్ కే సపోర్ట్ చేసి రేవంత్ కు షాకిచ్చారు. వారంతా సెలెక్ట్ చేసిన ఉత్తమ్ భార్యనే హుజూర్ నగర్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఖరారు చేసింది. దీంతో షాక్ అవ్వడం రేవంత్ వంతయ్యింది..
ఇక సోనియా ఇస్తానన్న పీసీసీ పీఠం దక్కకపోవడం.. హుజూర్ నగర్ విషయంలో సీనియర్లంతా రేవంత్ పై తిరుగుబాటు చేయడంతో ఇక లాభం లేదనుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలు దేరినట్టు తెలిసింది. కాంగ్రెస్ పెద్దలతో పీసీసీ పీఠంపై తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం.