Begin typing your search above and press return to search.

ట్రంప్ ఓటమి.. ఈ సంతోషంలో నగ్నంగా డ్యాన్స్ చేస్తా

By:  Tupaki Desk   |   5 Nov 2020 3:45 AM
ట్రంప్ ఓటమి.. ఈ సంతోషంలో నగ్నంగా డ్యాన్స్ చేస్తా
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎవరి నోట చూసినా ట్రంప్ గెలుస్తాడా? ప్రత్యర్థి జోబిడెన్ కు విజయం వరిస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అమెరికా ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఓ వైపు ఉత్కంఠ రేకెత్తిస్తున్న సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. చివరకు ప్రపంచం ఒక బొద్దింకను వదిలించుకుంటుంది.. ఈ సంతోషంలో రోడ్ల పై నగ్నంగా డ్యాన్స్ చేయాలని ఉందని ఎద్దేవ చేస్తూ వ్యాఖ్యానించారు.

‘రిపబ్లికన్ లు అతిపెద్ద లబ్ధిదారులు. ఎందుకంటే ఇప్పుడు వారు తీపి సెనేట్‌ను ఉంచగలుగుతారు. ఎట్టకేలకు తమ చేదు అధ్యక్షుడిని వదిలించుకున్నారు .. వారు కూడా ఖచ్చితంగా నగ్నంగా డ్యాన్స్ చేయాలి. ఎప్పటి నుంచో డొనాల్డ్ ట్రంప్‌ వైట్‌ హౌస్‌ను విడిచిరాలేకపోయారు. కానీ, అక్కడి పోలీసు కానిస్టేబుళ్లే బయటకు లాగడాన్ని ప్రపంచం చూసే అవకాశం ఉంది. ఇక వార్త చానెల్స్‌ డబ్బుల వసూళ్లు కోసం మిలియన్ అవతారాలను ఎత్తుతాయి’ అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

వర్మ ట్రంప్ ను బొద్దింకలతో పోల్చడం.. రిపబ్లికన్స్ పై కూడా నోరుపారేసుకొని తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. ట్రంప్ లాంటి ఇండియట్ ను గ్రేట్ కంట్రీ అమెరికా ఇప్పటికైనా వదిలించుకుందని వరుస ట్వీట్లతో హీట్ పెంచారు.

ఇక అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేసి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే డేరింగ్ స్టెప్ వేశాడంటూ ట్వీట్లో వర్మ పొగిడాడు.