Begin typing your search above and press return to search.
రోజా డైమండ్ రాణి.. లోకేష్ అంకుల్!!
By: Tupaki Desk | 1 Feb 2023 10:00 PM GMTఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు మరింత ముదిరాయి. యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్.. మంత్రి రోజాపై విమర్శలు గుప్పించారు. రోజాను 'డైమండ్ రాణి' అని వ్యాఖ్యానించారు. అయితే.. దీనికి రోజా కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. లోకేష్‌ను 'అంకుల్' అని కామెంట్ చేశారు.
"యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ఈ రాష్ట్రానికి ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకొని హైదరాబాద్ లో దాచుకోవడమే కాకుండా మళ్ళీ తండ్రిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని హతహలాడుతున్నారు" అని రోజా కౌంటర్ విసిరారు.
ఒకవైపు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వేధించినప్పటికీ జగన్ ఆత్మస్థైర్యంతో పాదయాత్రను ప్రారంభించారని రోజా అన్నారు. పేదల కష్టాలను వింటూ అధికారంలోకి వచ్చాక తూచా తప్పకుండా ఆ కష్టాలను తీరుస్తున్నారని తెలిపారు. ఆ ధైర్యంతోనే మళ్ళీ ఓట్లు అడుగుతున్నామని మంత్రి చెప్పారు.
"మీ తండ్రీకొడుకులు మీకవసరమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకొని, అధికారం వచ్చాక వాళ్ళను విస్మరిస్తున్నారు. అది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. నీ సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే పది మంది కూడా నీతో లేకుండా పాదయాత్ర చేస్తావు. నీది యువగళం కాదు ఒంటరిగళం. నువ్వు లీడర్‌గా వంద శాతం ఫెయిల్యూర్. ఇది మంగళగిరి ప్రజలు గుర్తించే నిన్ను ఓడించారు. తండ్రి ముఖ్యమంత్రిగా, తను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని రికార్డు లోకేష్‌ది" అంటూ రోజా ధ్వజమెత్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.