Begin typing your search above and press return to search.
మెగాస్టార్ కు ఐపీఎస్ సజ్జనార్ రిక్వెస్ట్!
By: Tupaki Desk | 31 March 2023 3:02 PM GMTస్టార్ హీరోలు.. సెలబ్రిటీలు తమకు ఎలాగూ డబ్బు వస్తుంది కదా అని ఇష్టానుసారంగా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీల వల్ల జనాలు మోసపోతున్న విషయాన్ని.. ప్రాణాలు పోతున్న విషయాన్ని కూడా సెలబ్రిటీలు పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ పదుల కొద్దీ యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. అందులో కొన్ని కంపెనీలు జనాలను మోసం చేసేవి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వందల కోట్ల ఆదాయం కలిగి ఉన్న అమితాబచ్చన్ ప్రమోషన్ చేసే కొన్ని కంపెనీలు జనాలను గతంలో మోసం చేసిన దాఖలాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన వాటిని పట్టించుకోకుండా డబ్బు కోసం ప్రమోషన్ చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా అమితాబచ్చన్ ఆమ్వే అనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థను ప్రమోట్ చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవలే అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.
ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు గతంలో కొన్ని వేల మంది జీవితాలతో ఆడుకున్నాయి. అమితాబచ్చన్ తో పాటు ఇతర సెలబ్రిటీలు ఈ సంస్థకి ప్రచారకర్తలుగా వ్యవహరించడం పై ఐపీఎస్ అధికారి.. టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
అమితాబ్ తో పాటు మిగిలిన స్టార్ హీరోలు అందరికీ నాది ఒక విజ్ఞప్తి.. మోసం చేసే కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించవద్దు. మీ యొక్క స్టార్ డమ్ ను.. గుర్తింపును మంచి కోసం వాడండి. మీ పేరు ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలకు ఉపయోగించవద్దు.
ఆమ్వే వంటి కంపెనీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇప్పటికే ఈ సంస్థపై విచారణ జరుగుతుంది. ఈడీ ఈ కంపెనీ యొక్క ఆస్తులను జప్తు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. కనుక ఆమ్వే పై ఉన్న కేసులన్నీ దృష్ట్యా ఇలాంటి సంస్థలకు ప్రమోషన్ చేయవద్దని సజ్జనార్ సున్నితంగా వార్నింగ్ ఇస్తూనే విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అమితాబ్ ఏమైనా స్పందిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.