Begin typing your search above and press return to search.

కేటీఆర్ కౌంటర్ ట్వీట్ కు సమంత లైక్

By:  Tupaki Desk   |   13 Jun 2022 1:30 PM
కేటీఆర్ కౌంటర్ ట్వీట్ కు సమంత లైక్
X
గ్లామరస్ బ్యూటీ సమంత మెల్లగా తన స్టార్ హోదాను మరో లెవెల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆమె రాజకీయాల్లోకి మాత్రం చాలావరకు దూరంగానే ఉంటుంది. కేవలం కొన్ని సామాజిక అంశాలపై మాత్రమే స్పందిస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు తెలంగాణ ప్రభుత్వం తో కలిసి ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. కేవలం ఈవెంట్స్ కు మాత్రమే రాజకీయ నాయకులతో కలిసి కనిపించే సమంత ఇతర పాలిటిక్స్ పై మాత్రం పెద్దగా స్పందించలేదు.

ఆ మధ్య తెలంగాణ హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగిన విషయం తెలిసిందే. అప్పుడు మంత్రి కేటీఆర్ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కేటీఆర్ ట్వీట్స్ పై కూడా సమంత ప్రతిస్పందిస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఒక సెటైరికల్ ట్వీట్ కు లైక్ కొట్టడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

దేశానికి కావాల్సింది డ‌బుల్ ఇంపాక్ట్ పాల‌న అని అంటూ.. ప‌నికిరాని డ‌బుల్ ఇంజిన్లు కాదని అన్నారు. అలాగే.. దేశ జ‌నాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ‌.. దేశ జీడీపీకి 5.0 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గ‌ణాంకాలు 2021, అక్టోబ‌ర్‌లో ఆర్‌బీఐ విడుద‌ల చేసిన నివేదిక‌లోనివే అని కూడా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో వైరల్ గా మారింది. అయితే సమంత, కేటీఆర్ కు మద్దతు పలుకుతూ ట్వీట్ కు లైక్ కొట్టడంతో మరింత వైరల్ గా మారింది.

సాధారణంగా ఇతర రాజకీయ వివాదంలో సమంత అసలు కలుగజేసుకోదు. అలాంటిది ఇప్పుడు ఆమె ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ట్వీట్కు లైక్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక రాజకీయ ప్రత్యర్థులు ఆమెపై కూడా నెగటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే యశోద అలాగే శాకుంతలం రెండు సినిమాలు కూడా షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో కొనసాగుతున్నాయి. మరోవైపు ఖుషి సినిమా ప్రొడక్షన్ దశలో ఉన్న విషయం తెలిసిందే.