Begin typing your search above and press return to search.

వందేళ్ల తర్వాత .. మూసి నదికి శాంతి పూజ !

By:  Tupaki Desk   |   21 Oct 2020 12:50 PM GMT
వందేళ్ల తర్వాత ..  మూసి నదికి శాంతి పూజ !
X
గతవారం కొన్ని రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం విలవిలలాడుతోంది. భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో నగరం సముద్రాన్ని తలపిస్తుంది. ఇదిలా ఉంటే , తాజాగా మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం పక్కా ప్రణాళికలతో సిద్ధమైయ్యారు . అయితే భారీ వరదల నేపథ్యంలో మూసీ నదికి శాంతి పూజలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జిహెచ్ ఎం సి మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మూసీ నది మీద ఉన్న పురానాపూల్ కామన్ వద్ద హైదరాబాద్ కు చెందిన మంత్రులు .. మహమ్మద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మూసీ నదికి శాంతి పూజ చేసి, గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు.

నిజానికి 1908 లో మూసీకి వచ్చిన బజారు వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులై వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. 36 గంటల్లో 16 సెంటీమీటర్లు నమోదైన వర్షపాతంతో దాదాపు 15వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆ సమయంలో నాటి పండితుల సూచనల మేరకు నిజం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కూడా మూసీ కి శాంతి పూజలు చేసి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఆ తర్వాత మూసీ నది శాంతించిందని చరిత్ర కారులు చెప్తున్నారు. దీనితో ఇపుడు కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రభుత్వం మూసి నదికి శాంతి పూజ నిర్వహించింది. ఇక , దర్గా లో కూడా ప్రజాప్రతినిధులందరూ కలిసి చాదర్ సమర్పించబోతున్న.