Begin typing your search above and press return to search.

కుప్పకూలిన సర్దార్ సర్వాయి పాపన్న కోట !

By:  Tupaki Desk   |   15 Oct 2020 11:10 AM GMT
కుప్పకూలిన సర్దార్ సర్వాయి పాపన్న కోట !
X
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సర్దార్ సర్వాయి పాపన్న కోట కుప్ప కూలిపోయింది. భూస్వాముల చేతుల్లో, గడీల‌లో మగ్గిపోతున్న అణగారిన వర్గాల‌కు, స్యేచ్ఛ‌ను, రాజ్యాధికారాన్ని ఇచ్చి ఒక సైన్యాన్ని నిర్మించిన మ‌హా వ్య‌క్తి స‌ర్వాయి పాప‌న్న, భువన గిరి కోట నుంచి గోల్కొండ కోట వరకు త‌న ప‌రాక్ర‌మ జెండా ఎగుర‌వేసిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న నిర్మించిన కోట కుప్ప నేలమట్టం అయింది. సర్వాయి పాపన్న స్వస్థలం అయిన జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్ గ్రామంలోని కోట ఇటీవలే వర్షాలకు కొంచెం బీటలు వారింది. అయినప్పటికీ ఆ కోటను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఈ రోజు ఉదయం నేలమట్టం అయింది.

అయితే , అదృష్ట వశాత్తూ ఎవరికి ప్రమాదం జరగలేదు. ప్రత్యేక రాష్ట్ర వచ్చాక కూడా మన చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. 6 ఏళ్ల నుంచి ఒక్కరు కూడా కోట నిర్వహణను పట్టించుకోలేదంటున్నారు. 350 ఏళ్లనాటి కోట కూలడంతో గ్రామస్తులు, జిల్లా వాసులు చింతిస్తున్నారు. కాగా ఈ కోటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా గుర్తించి , 4 కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది. అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు.