Begin typing your search above and press return to search.
మిసెస్ ఆసియా ఆసియా - యూఎస్‌ఏగా విశాఖ యువతి!
By: Tupaki Desk | 27 Nov 2022 2:30 AM GMTమిసెస్ ఆసియా -యూఎస్‌ఏ 2023గా విశాఖపట్నంకు చెందిన సరోజా అల్లూరి నిలిచారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చెందిన విర్జెలియా ప్రొడక్షన్స్ ఇంక్.. ప్రతి సంవత్సరం మిస్ / మిసెస్ లాటినా గ్లోబల్ మిస్ / మిసెస్ ఆసియా యుఎస్‌ఏ, మిస్ / మిసెస్ వంటి వివిధ విభాగాలలో ఈ పోటీలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా యూరప్ గ్లోబల్, మిసెస్ ఇండియా యూఎస్‌ఏ, మిస్ టీన్ ఆసియా యూఎస్‌ఏ, మిస్ టీన్ లాటినా గ్లోబల్ విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తోంది.
విర్జెలియా ప్రొడకక్షన్స్ ఇంక్ 34వ వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్ ఫినాలే కాలిఫోర్నియాలోని రెడోండో బీచ్‌లో జరిగింది. పోటీదారులలో ఒకరైన సరోజా అల్లూరి మిసెస్ ఆసియా యూఎస్‌ఏ టైటిల్‌ను దక్కించుకుని రికార్డు సృష్టించారు.
నేషనల్ కాస్ట్యూమ్, ఈవినింగ్ గౌన్ రౌండ్లలో ఇతర పోటీదారులతో పోలిస్తే సరోజ అత్యధిక పాయింట్లు సాధించింది. ఇక మిగిలిన రౌండ్‌లలోనూ సరోజ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో మిసెస్ ఆసియా యూఎస్‌ఏ 2023 కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. తద్వారా ఈ కిరీటాన్ని దక్కించుకున్న తొలి సౌతిండియన్ మహిళగా సరోజ మరో రికార్డు దక్కించుకుంది.
ప్రధాన టైటిల్‌తో పాటు సరోజకు 'మిసెస్ పాపులారిటీ', 'పీపుల్స్ ఛాయిస్ అవార్డులు', మిస్ అండ్ మిసెస్ ఏషియా అవార్డు దక్కాయి. జపాన్, ఫిలిప్పీన్స్, చైనా, థాయ్‌లాండ్, మంగోలియా, ఇండోనేషియా మొదలైన దేశాలకు చెందిన వారితో పోటీ పడి సరోజ ఈ టైటిల్‌ను దక్కించుకోవడం విశేషం.
కాగా సరోజ న్యూయార్క్‌లో విద్యనభ్యసించారు. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ చేసింది. ప్రస్తుతం ఆమె యునైటెడ్ స్టేట్స్‌లోని టాప్ టెలికాం ఆపరేటర్‌గా ఉన్న ఏటీ అండ్ టీలో టెక్నాలజీ లీడ్‌గా పని చేస్తున్నారు. వివాహానంతరం ఆమె లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడింది. ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సరోజ ఇంజనీర్ మాత్రమే కాకుండా మంచి పరోపకారి కూడా. ఆమె అభిరుచులు... డ్యాన్స్, ఛారిటీ. ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ ఆమెకు మంచి ప్రతిభ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.