Begin typing your search above and press return to search.
వెన్నుచూపని మరాఠా యోధుడు
By: Tupaki Desk | 27 Nov 2019 9:13 AM GMTమహారాష్ట్రలో బీజేపీలో ఓడిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉండి.. అస్త్రశస్త్రాలు కలిగి ఉండి మందీ మార్బలం ఉండీ కూడా ఓడిపోయింది. బీజేపీ ఓడిపోయిందని చెప్పడం కంటే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గెలిచాడని చెబితే కరెక్ట్.
మోడీషా సహా కేంద్రంలోని పెద్దలందరూ ఏకమైన ఈ మరాఠా యోధుడి పట్టుదల - చాణక్యం ముందు అందరూ ఓడిపోయారు. దేశాన్ని గుప్పిట పట్టిన అమిత్ షా చాణక్యం కూడా ఇక్కడ పనిచేయకపోవడం గమనార్హం. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పట్టుదల - చాణక్యం - రాజకీయం వెరిసి మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరాఠా యోధుడిగా పవార్ నిలిచి తన పవర్ ను చూపించాడు.
ముఖ్యంగా ఎన్సీపీని చీల్చిన అమిత్ షా చాణక్యాన్ని జయించడంలో శరద్ పవార్ ఫ్యామిలీ కార్డ్ ప్రయోగం అద్భుతంగా పనిచేసింది. నేతలు చేయలేని పనిని శరద్ పవార్ భార్య, కూతుళ్లు చేశారు.. తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ ను వెనక్కి రప్పించడంలో ముగ్గురు ఆడవాళ్లు కీలక పాత్ర పోషించడం శరద్ పవార్ చాణక్య నీతికి నిదర్శనంగా చెప్పవచ్చు.
శరద్ పవార్ రాజకీయ దురంధరుడు. నాలుగు సార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. లోక్ సభలో విపక్ష నేతగా వ్యవహరించారు. పీవీ నరసింహారావు హయాంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. మన్ మోహన్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. కాంగ్రెస్ లోనే ఉండే ఈయన ఆ పార్టీని వ్యతిరేకించి ఎన్సీపీని స్థాపించారు. అనంతరం అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కొనసాగుతున్నారు.
ఎన్నికలకు ముందు శరద్ పవార్ - అజిత్ పవార్ పై బీజేపీ ఐటీ - ఈడీ కేసులు పెట్టింది. అయినా మొక్కవోని పట్టుదలతో శరద్ పవార్ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టాడు. ఫలితాల తర్వాత బీజేపీతో కాంప్రమైజ్ కాకుండా అదే రీతిలో పోరాడడం ఆయనలోని రాజకీయ నిబద్ధతకు నిదర్శనం.
ఇక పొత్తు పెట్టుకొని పదవుల కోసం వేరుపడ్డ శివసేన-బీజేపీ రాజకీయ విభేదాలను ‘పవార్’ తన చాణక్యంతో వాడుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. 54 సీట్లు వచ్చినా ఎన్సీపీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉందంటే అది పవార్ మహిమే.. ఉప్పు నిప్పు లాంటి శివసేన - కాంగ్రెస్ లను కలిపిన ఘనత పవార్ దే. ఇలా అలివికాని అసాధ్యాలను సుసాధ్యం చేసిన శరద్ పవార్ మరాఠా ఎపిసోడ్ లో హీరోగా మిగిలిపోయారు.