Begin typing your search above and press return to search.
పాదయాత్రకే షర్మిల భారీ ప్లానింగ్.. ఎప్పుడు? ఎక్కడ నుంచంటే?
By: Tupaki Desk | 10 Aug 2021 3:50 AM GMTఅనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దివంగత మహానేత కుమార్తె వైఎస్ షర్మిల.. తన పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన కార్యక్రమాల్ని వేగంగా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో అధికారాన్ని చేపడతామని.. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతామని.. గడిచిన కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న ఆమె.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని తెచ్చేందుకు వీలుగా ఆమె ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని చేపడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా.. ఇప్పటివరకు రావాల్సిన మైలేజీ రాలేదన్న భావనలో ఉన్న షర్మిల.. అన్నింటికి సమాధానంగా తన దగ్గరున్న పాదయాత్ర అస్త్రాన్ని బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ పెట్టిన కొత్తల్లోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్న సంకేతాలు ఇచ్చిన షర్మిల.. తాజాగా దాన్ని రియాలీటీలోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
అక్టోబరు 18న ఆమె చేవెళ్ల నుంచి పాదయాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె పాదయాత్ర చేవెళ్ల నుంచి మొదలవుతుందని.. తన తండ్రి గతంలో ప్రారంభించిన ప్రాంతం నుంచే మొదలుపెడతారని చెబుతున్నారు. అప్పట్లో వైఎస్.. చేవెళ్ల చెల్లెమ్మగా పిలుచుకునే సబితా ఇంద్రారెడ్డి ఇంటి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతంఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గతంలో రెండుదఫాలు పాదయాత్రలు చేసిన అనుభవం షర్మిలకు ఉంది. దీంతో పాదయాత్రను చేయటం ఆమెకు కష్టంగా అనిపించకపోవచ్చు. కాకుంటే.. ఫలితం ఎలా ఉంటుందన్నది ప్రశ్న. తాజాగా చేపట్టనున్న పాదయాత్ర మూడోసారి అవుతుంది. పాదయాత్రకు ముందు పలు కార్యక్రమాల్ని వరుసగా చేపట్టాలన్న యోచనలో షర్మిల ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా పలు వర్గాల వారిని పరామర్శలు పెట్టుకోనున్నారు.
ఈ రోజు (మంగళవారం) హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి.. నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తాజా దీక్ష లోనూ సీఎం కేసీఆర్ మీద ఘాటు విమర్శలు మరిన్ని చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.