Begin typing your search above and press return to search.
శతాబ్ది.. రాజధానులకు మోడీ సర్కారు గుడ్ బై.. మరేం చేస్తారంటే?
By: Tupaki Desk | 25 Jun 2023 9:00 PM GMTబలమైన ముద్ర వేయాలంటే అందుకు తగ్గట్లు అడుగులు వేయాలి. తాము తప్పించి.. దేశాన్ని.. రాష్ట్రాన్ని మరెవరూ బాగు చేయలేదని తరచూ చెప్పుకునే అధికారపక్షాలు అందుకు అనుగుణంగా తీసుకొనే కొన్ని నిర్ణయాలు స్వార్థ పూరితంగా.. ప్రజల మీద భారం మోపేలా మారుతుంటాయి. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఈ తరహాలోనే ఉంటాయని చెబుతారు.
తియ్యటి మాటలతో మనసు దోచుకునే మోడీ ప్రభావం ఎంతంటే.. ఆయన మాటలు విన్నంతనే ట్రాన్స్ లోకి వెళ్లిపోయి.. విచక్షణ మర్చిపోయే పరిస్థితి. ఆయన చెప్పిందే నిజమని నమ్మేయటం.. అప్పటికే కళ్ల ముందున్న వాస్తవాల్ని చూడటం మానేలా మెదడుకు కమాండ్స్ వెళ్లిపోతాయన్న విమర్శ ఉంది. రైల్వేల రూపురేఖల్ని మార్చేస్తానంటూ 2014 ఎన్నికలకు ముందు మోడీ అండ్ టీం చెబుతున్నప్పుడు దేశ ప్రజలు ఎన్నో కలలు కన్నారు. ప్రజారవాణాను భారతీయ ఆత్మకు తగ్గట్లు మార్పులు చేస్తే.. దేశానికి చాలా మార్పులు వస్తాయని భావించారు.
కానీ.. జరుగుతున్నదేంటి? ఇప్పటికే ఉన్న రైళ్లను రద్దు చేయటం.. ప్యాసింజర్.. డెమో రైళ్లను తగ్గించేసి.. వాటి స్థానంలో కొత్త పేర్లతో స్పెషల్ సర్వీసుల్ని నడిపేస్తూ.. ప్రయాణికుల నెత్తి మీద భారాన్ని మోపే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల తెర మీదకు తీసుకొచ్చిన వందే భారత్ ట్రైన్ల గురించి గొప్పగా చెప్పుకునే మోడీ సర్కారు.. అదే వేగంతో.. ఇప్పటికే పలు ట్రైన్లు పట్టాల మీద పరుగులు తీస్తున్న విషయాన్ని మాత్రం మర్చిపోయేలా చేయటం తెలిసిందే.
ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన రైలు.. వందే భారత్ గరిష్ఠ వేగానికి ఇంచుమించు సమానం. మరి.. ఆ ట్రైన్ లో టికెట్ల ధర ఎంత? వందే భారత్ లో ఎంత? అన్నది లెక్కచూస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది. నిజానికి వందే భారత్ రైళ్ల వేగం ఒక మేజిక్ గా చెప్పాలి. ఎందుకుంటే.. ఆ రైళ్ల స్టాపుల్ని తగ్గించేయటం.. వీలైనంత వరకు సమయానికి వెళ్లేలా ప్లాన్ చేసిన కారణంగా ప్రయాణ వేగం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాస్తవం అయితే అది కాదనిపిస్తుంది. ఎందుకుంటే.. వందేభారత్ వేగానికి తగ్గట్లే.. పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు.. దురంతో.. శతాబ్ది.. రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం కూడా వందే భారత్ తరహాలోనే ఉంటాయన్నది మర్చిపోకూడదు.
కాకుంటే.. పాత కాలం కోచ్ ల స్థానంలో అప్ గ్రేడ్ చేసిన అత్యాధునిక కోచ్ లతో.. వాటి రంగులతో..కట్టిపడేసే ఇంటీరియర్ తో ఏదో అద్భుతం జరుగుతుందన్న ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఏమంటే.. వందే భారత్ రైలు వేగానికి ఇంచుమించు దగ్గరగా ఉండే రైళ్ల టికెట్ల ధరల్ని వందే భారత్ టికెట్ల ధరల్ని సరిపోలిస్తే.. అసలు విషయం అర్థం కావటమే కాదు.. సర్కారు దోపిడీ మీద స్పష్టత వస్తుంది.
వందేభారత్ రైళ్ల ద్వారా.. రైళ్ల వ్యవస్థను సమూలంగా మార్చేస్తున్నట్లుగా గొప్ప ప్రచారం చేసుకునే వేళ.. మరో దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు.ఇప్పటికే సూపర్ ఫాస్ట్ రైళ్లుగా పేరున్న శతాబ్ది.. రాజధాని రైళ్లకు మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నారు. కొత్తగా పట్టాల మీదకు తీసుకొచ్చి.. సక్సెస్ అయిన వందే భారత్ రైళ్లను వీటి స్థానంలో పరుగులు తీయించాలన్న ఆలోచనతో రైల్వే శాఖ ఉంది. అందుకు తగ్గట్లే.. క్రమపద్దతిలో వందే భారత్ ను ప్రమోట్ చేస్తున్న కేంద్ర రైల్వే శాఖ.. అదే సమయంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు మంగళం పాడేలా చేస్తోంది.
ఇప్పటివరకు వందే భారత్ సిరీస్ లో సీటింగ్ రైళ్లు ఉండగా.. త్వరలో (వచ్చే ఏడాదికి) బెర్తులతో కూడిన వందే భారత్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకుగాను శతాబ్ది.. రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లకు మంగళం పాడేస్తున్నారు. ప్రయాణికుల మీద భారాన్ని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. భారత తొలి ప్రధాని నెహ్రూ శతజయంతికి గుర్తుగా శతాబ్ది (వందేళ్లు) పేరుతో 1988లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైళ్లను తీసుకొచ్చింది. అదే సమయంలో 1969లో ఢిల్లీ-హౌరాల మధ్య తొలి రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18 రాజధాని రైళ్లు నడుస్తున్నాయి.
మోడీ మార్కు రైళ్లను ప్రమోట్ చేసేందుకు వందే భారత్ ను మార్పులు చేసి.. ఇప్పటికే తిరుగుతున్న శతాబ్ది.. రాజధాని రైళ్లను తీసేస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. రైల్వేలలో ఘన చరిత్ర ఉన్న కొన్ని రైళ్లు గతకాలపు గురుతులుగా మారి.. చరిత్రలో మరుగన పడనున్నాయి. మోడీనా మజాకానా?