Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే బరిలో హీరో తనయుడు.. బిహార్ ఎలక్షన్స్‌లో ఇదే స్పెషల్ అట్రాక్షన్
By: Tupaki Desk | 20 Oct 2020 5:32 PM GMTబిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడ ఇప్పుడు ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. అలనాటి స్టార్ హీరో, పొలిటీషియన్ శత్రుఘ్నసిన్హా తనయుడు లవ్ సిన్హా ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. దీంతో ఇప్పడు లవ్ సిన్హా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన ప్రస్తుతం పట్నా సాహిబ్ లోక్ సభ సీటు పరిధిలోని బంకీపుర్ అసెంబ్లీ సీటు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీలో నిలిచారు.
గతంలో శత్రుఘ్నసిన్హా బీజేపీ తరఫున పట్నా సాహిబ్ లోక్ సభ సీటు వరసగా రెండుసార్లుగా ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. 2014 తర్వాత ఆయన బీజేపీ అధినాయత్వంతో తీవ్రంగా విభేదించారు. సొంతపార్టీపైనే విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు.
ఈ క్రమంలో 2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్లీ పట్నాసాహిబ్ నుంచి రవిశంకర ప్రసాద్ పై ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనపై గెలుపొందిన రవిశంకప్రసాద్ కేంద్ర మంత్రి కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీచేస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ నా కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన నేను రిటైర్ అయినట్టు కాదు. నాకింకా పోటీచేసే అవకాశం ఉంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు గెలుస్తాడో లేదో వేచిచూడాలి. మొత్తానికి బిహార్ లో రాజకీయ వేడి చిన్న చిన్నగా మొదలవుతోంది.