Begin typing your search above and press return to search.
మొతెరా క్యూరేటర్ బౌన్సర్.. టీమిండియాకు షాక్?
By: Tupaki Desk | 8 March 2023 4:26 PM GMTమూడు టెస్టులు.. ఒక్కోటి రెండున్నర రోజులు.. భారత్ -ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ గురించి సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఇంతే. ఏ ఒక్క మ్యాచ్ కూడా మూడో రోజు మూడో సెషన్ వరకు రాలేదు. అసలిది ఆస్ట్రేలియా-భారత్ సిరీస్ లేక భారత్-జింబాబ్వే, భారత్-అఫ్ఘానిస్థాన్ సిరీసా? అనుమానం వచ్చింది. అలాగని ఇక్కడేదో టీమిండియా గొప్పగా ఆడిందని ఏమీ లేదు. మూడో టెస్టు ఫలితం చూస్తేనే వాస్తవం ఏమిటో బోధపడుతోంది. మొదటి రెండు టెస్టుల్లోనూ టీమిండియా లోయరార్డర్ ఆదుకోబట్టి సరిపోయింది. లేదంటే ఒక్క మ్యాచ్ లోనైనా ఫలితం అటుఇటు అయ్యేది. ఇదంతా వదిలేస్తే.. గురువారం నుంచి నాలుగో టెస్టు జరగనుంది. స్పిన్నా..? పేసా? భారత్ లో టెస్టు మ్యాచ్ అంటే స్పిన్ అనుకూలం అనే భావన విదేశీ జట్లది. ఆయా జట్లు దీనికితగ్గట్లుగా తయారయి వస్తాయి కూడా. అంతెందుకు ఆసీస్ కూడా భారత టూర్ కు ముందు మానసికంగా, జట్టుపరంగా సిద్ధమయ్యే వచ్చింది. ఏకంగా నలుగురు స్పిన్నర్లతో కాలుపెట్టింది. కాగా, తాజా సిరీస్ లో తొలి రెండు టెస్టులు ముగిశాక ఫలితం మనకు అనుకూలంగా ఉండడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మూడో టెస్టులో జట్టు ఓటమితో పిచ్ గురించి చర్చ మొదలైంది. అది రెండు జట్ల మాజీలు, దిగ్గజాల కామెంట్ల వరకు వెళ్లింది. సరే.. ఇక నాలుగో టెస్టు విషయానికి వస్తే.. ఎలాంటి పిచ్ సిద్ధం చేస్తున్నారు? ఎప్పటిలాగే బంతి విపరీతంగా తిరగబోతుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ అహ్మదాబాద్‌పైనే నిలిచింది.
ఫొటోలు చూశాక మరింత గందరగోళం?
సహజంగా మ్యాచ్ జరిగే ముందు రోజు, రెండు రోజుల ముందో పిచ్ గురించిన ఫొటోలు బయటకు వస్తాయి. ఇలా వచ్చిన అహ్మదాబాద్ పిచ్ ఫొటోలు చూసి మరింత గందరగోళం రేగుతోంది. అవి అస్పష్టతను మరింత పెంచేలా ఉండడమే దీనికి కారణం. మరోవైపు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియాకు విజయం తప్పనిసరి కావడంతో ఈ మ్యాచ్‌కు ఇంకా ప్రాధాన్యం ఏర్పడింది. మోదీ పిచ్ పై మన జట్టు ఓడుతుందా? గురువారం నుంచి జరగనున్న నాలుగో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌తో కలిసి మ్యాచ్ వీక్షించబోతున్నారు. ఈ మ్యాచ్ జరుగుతున్న రాష్ట్రం గుజరాత్. అంటే మోదీ సొంత రాష్ట్రం. దీనికితోడు ఆయనే స్వయంగా హాజరుకానున్నారు. ఇక ఇది ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియం. నరేంద్ర మోదీ పేరు మీదనే ఉంది. దీని సామర్థ్యం 1,32,000. ఒక మ్యాచ్‌కు హాజరైన అభిమానుల లెక్కల్లో మెల్‌బోర్న్ స్టేడియం (1,00,024) ఇప్పటివరకు రికార్డును సొంతం చేసుకుంది. నాలుగో టెస్టులో అహ్మదాబాద్ మైదానం కనీసం 95 శాతం నిండినా..ఆ రికార్డు బద్దలు కావడం ఖాయం. మరోవైపు మోదీనే స్వయంగా వస్తూ, ఆయన పేరిట ఉన్న స్టేడియంలో మ్యాచ్ జరుగుతూ, అదీ కీలక సమయంలో జరుగుతూ మన జట్టు ఓడిపోయేలా పిచ్ తయారు చేస్తారా? అన్నది సందేహమే.
కానీ, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వీడని సస్పెన్స్? అహ్మదాబాద్ పిచ్ క్యూరేటర్ ఇరు జట్లకు షాకిస్తూ.. మ్యాచ్ కోసం ఏకంగా రెండు పిచ్ లను తయారు చేశాడు. మంగళవారం ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కు వెళ్లగా.. రెండు చోట్ల కవర్స్ కప్పి ఉన్నాయి. దాంతో జట్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారని సమాచారం. ఇదే విషయాన్ని క్యూరేటర్ ను ప్రశ్నించగా.. పిచ్ విషయంలో బీసీసీఐ నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నాడు.. దాంతో రెండు రకాల పిచ్ లను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకటి రెడ్ సాయిల్ వికెట్ కాగా.. రెండోది బ్లాక్ సాయిల్ వికెట్. ఇక మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ కోసం బౌన్సీ వికెట్ తయారు చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ జూన్ లో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆడేది దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఫైనల్ ఇంగ్లండ్ లోని ఓవల్ లో జరగనుండటం.. అక్కడ బౌన్స్ కు అనుకూలించే పిచ్ లు ఉండటంతో అందుకు సన్నాహకంగా ఈ మ్యాచ్ ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో భారత్ ఉన్నట్లు తెలుస్తుంది.
అసలు నిర్ణయం తీసుకున్నారా?
మోదీ స్టేడియంలో ఎలాంటి పిచ్ ఉండాలన్న దానిపై బీసీసీఐ ఇంకా ఒక నిర్ణయం తీసుకోనట్లే కనిపిస్తోంది. పిచ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు బయటికొచ్చాయి. కానీ ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఆస్ట్రేలియా బృందం ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. మ్యాచ్ ఆరంభమయ్యేది గురువారమే. ఎంతో సమయం లేదు. అయినా పిచ్ తయారీకి సంబంధించి బీసీసీఐ నుంచి గానీ, భారత జట్టు మేనేజ్‌మెంట్ నుంచి తమకు ఎలాంటి సూచనలు అందలేదని క్యురేటర్లు చెప్పారు. దీన్ని బట్టి ఎలాంటి పిచ్ కావాలన్న విషయంలో భారత శిబిరం కూడా సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం వరకు నాలుగో టెస్టు వేదికలో రెండు పిచ్‌లను కప్పి ఉంచారు. మ్యాచ్‌కు దేన్ని ఉపయోగిస్తారో తెలియదు. దీంతో పిచ్ స్వభావంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. "భారత జట్టు మేనేజ్‌మెంట్ నుంచి మాకు ఏ సూచనలూ అందలేదు. స్థానిక క్యురేటర్లు మామూలు పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు. సీజన్ ఆసాంతం ఉన్నట్లే పిచ్ ఇప్పుడూ ఉంటుంది" అని గుజరాత్ క్రికెట్ సంఘానికి చెందిన ఓ అధికారి ఇంతకుముందు చెప్పాడు. మంచి టెస్టు మ్యాచ్ పిచ్‌ను సిద్ధం చేయాలన్నదే తమ లక్ష్యమన్నాడు. ఏదేమైనా మ్యాచ్ ఫలితంలో పిచ్ మరోసారి కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.