Begin typing your search above and press return to search.

చ‌చ్చిపోయిన తండ్రి బ‌తికొస్తాడ‌ని.. 2 నెల‌ల బిడ్డ హ‌త్య‌.. భారీ ట్విస్ట్!

By:  Tupaki Desk   |   13 Nov 2022 7:04 AM GMT
చ‌చ్చిపోయిన తండ్రి బ‌తికొస్తాడ‌ని.. 2 నెల‌ల బిడ్డ హ‌త్య‌.. భారీ ట్విస్ట్!
X
దేశంలో మూఢ న‌మ్మ‌కాలు..ప్ర‌బ‌లుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ చాలా మంది ఈ ఊబిలో చిక్కుకుని చిత్ర‌మై న ఘ‌ట‌న‌లు చేస్తూ.. క‌ట‌క‌టాలు లెక్కిస్తున్నారు. తాజాగా దేశ రాజ‌ధాని డిల్లీలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న అంద‌రి నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఇక‌, ఈ ఘ‌ట‌న‌లో భారీ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. నరబలి ఇస్తే చనిపోయిన తండ్రి బతికొస్తాడని రెండు నెలల బిడ్డను చంపబోయిందో మహిళ. పథకం ప్రకారం చిన్నారి తల్లిని మచ్చిక చేసుకుని ఆమెను ఏమార్చి బిడ్డను కిడ్నాప్‌ చేసింది.

ఢిల్లీ న‌గ‌రం నడిబొడ్డున జ‌రిగిన ఈ ఘ‌ట‌న... కేరళలో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారనే కేసు వెలుగు చూసిన నెల రోజుల్లోనే వెలుగుచూడడం నివ్వెరపరిచింది. శ్వేత అనే మహిళ బుధవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో రెండు నెలల చిన్నారి తల్లిని కలిసింది. తను `జచ్చా-బచ్చా` అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకుంది. తమ సంస్థ ఆధ్వర్యంలో తల్లి, పిల్లలకు ఉచిత వైద్యం చేస్తామని చెప్పింది.

మహిళ చిరునామా తెలుసుకుని గురువారం గార్హిలోని మమ్‌రాజ్‌ మొహుల్లాలోని ఆమె ఇంటికి వెళ్లింది. బిడ్డను బహిర్భూమికి తీసుకువెళ్తానని బయటకు తీసుకువచ్చి కిడ్నాప్‌ చేసింది. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమర్‌కాలనీ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ రావత్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజేంద్ర సింగ్‌ ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు. కిడ్నాపర్‌ సమాచారం తెలుసుకుని కోట్ల ముబారక్‌పూర్‌లోని ఆర్యసమాజ్‌ వద్ద ఆమెను అరెస్టు చేశారు.

విచారణలో నిందితురాలు చెప్పిన విష‌యం తెలిసి పోలీసులు నివ్వెర పోయారు. త‌న తండ్రి ఇటీవ‌ల చ‌నిపోయ‌డ‌ని.. ఆయ‌న మ‌ళ్లీ బ‌తికి వ‌స్తాడ‌ని.. ఓ తాంత్రికుడు చెప్పిన‌ట్టు స‌ద‌రు నిందితురాలు పేర్కొంది. ఈ క్ర‌మంలో ప‌సిబిడ్డ‌ను బ‌లి ఇవ్వాల‌ని తాంత్రికుడు చెప్పిన‌ట్టు తెలిపింది. ఆమె గతంలో రెండు దోపిడీ కేసుల్లో నిందితురాలిగా గుర్తించారు. ఫిర్యాదు అందగానే పోలీసులు స్పందించడంతో కేసు 24 గంటల్లోనే సుఖాంతమైంది.