Begin typing your search above and press return to search.
దారుణం.. జీన్స్ వేసుకుందని అమ్మాయిపై షాప్ యజమాని దాడి
By: Tupaki Desk | 2 Nov 2021 1:30 AM GMTమహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా... ఆడవారంటే కొందరిలో మాత్రం ఓ రకమైన చిన్నచూపు లేకపోలేదు. కట్టుబాట్ల పేరిట ఆడవారిని ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు తరుచుగా తారసపడతాయి. ఇక అమ్మాయి చదువు, బట్టలు, మాటలు అన్నీ కూడా ఆంక్షల మధ్యే ఉండాలని కొందరు కోరుకుంటారు. అందుకు అంగీకరించకపోతే పద్ధతులు లేవంటూ దాడికి తెగబడతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఓ అమ్మాయికి ఎదురైంది. ఇయర్ ఫోన్స్ కొనడానికి ఓ షాపుకు వెళ్లిన ఆ అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. కారణం తెలిసి ఆ అమ్మాయితో పాటు చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే అమ్మాయి వేసుకున్న జీన్స్ వల్లే ఆ దుకాణ యజమాని ఆమెపై దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ అమానవీయ ఘటన అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో జరిగింది.
బిస్వనాథ్ జిల్లాలో ఓ అమ్మాయి జీన్స్ ధరించింది. ఇయర్స్ ఫోన్స్ కొందామని ఓ మొబైల్ షాపుకు వెళ్లింది. అక్కడ మొబైల్ యాక్సెసరీస్ సెక్షన్ లోకి వెళ్లింది. ఇంతలోనే షాపు యజమాని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆ అమ్మాయి తెలిపింది. పైగా తను వేసుకున్న బట్టల వల్లే ఈ చేదు అనుభవం ఎదురైందని వాపోయింది. దుకాణ యజమాని నూరల్ అమీన్ అనే వ్యక్తి... బాలికను దూషించినట్లు తెలుస్తోంది. బురఖాకు బదులు జీన్స్ వేసుకున్నందున అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను అవమాన పరిచి... షాపులోని వస్తువులను అమ్మనూ అంటూ గెంటేశాడని కంటతడి పెట్టుకుంది.
బురఖాకు బదులు జీన్స్ వేసుకున్న నువ్వు షాపులోకి రావొద్దంటూ దూషించినట్లు అమ్మాయి తెలిపింది. పైగా తన ఇంట్లో వారు చూస్తే ఇలాగే తయారవుతారని తిడుతూ దుకాణం నుంచి బయటకు పంపించాడని వాపోయింది. ఈ సంఘటనతో మనస్థాపానికి గురైన అమ్మాయి.. నేరుగా ఇంటికి వెళ్లి పరిస్థితిని ఆమె తల్లిదండ్రులకు వివరించింది. కాగా వారు అడగడానికి వస్తే మళ్లీ ఘర్షణ జరిగింది. షాప్ యజమానితో పాటు ఆయన ఇద్దరు కుమారులు కూడా అమ్మాయి కుటుంబసభ్యులపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. చేసేది లేక బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
ప్రస్తుత కాలంలోనూ మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా బాధాకరం. ఆడవారు కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నిజానికి చెప్పాలంటే మగాళ్లతో ఎందులోనూ తీసిపోమని చాటి చెబుతున్నారు. ఆటో నడపడం నుంచి విమానం నడిపే దాకా మహిళలు ఎదిగారు. మరి ఇలాంటి పరిస్థితుల్లోనూ వారి వస్త్రధారణపై ఇన్ని ఆంక్షలు ఉండడం ఆందోళన కలిగించే విషయమే. పైగా జీన్స్ వేసుకుంటే షాపులోని ఏం కొనడానికి వీలు లేదంటూ గెంటేయడం మంచి పద్ధతి కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మారిన కాలంతో పాటు కట్టుబాట్లు కూడా కొన్ని మారాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఆడవారికి విధించిన ఆంక్షల నుంచి ఇకనుంచి అయినా విముక్తి కలిగించాలని కోరుతున్నారు.