Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేశారు
By: Tupaki Desk | 26 Sep 2019 3:44 PM GMTతెలంగాణ రాజకీయాల్ని హాట్ హాట్ గా మార్చేస్తోంది హుజూర్ నగర్ ఉప ఎన్నిక. తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎంపీగా గెలుపొందటంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటం.. అంతకు ముందే అధికార టీఆర్ ఎస్ పార్టీ తన అభ్యర్థిగా సైదిరెడ్డిని ఎంపిక చేయటం తెలిసిందే. తొలి నుంచి అంచనా వేసినట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలోకి దిగారు. ఇదిలా ఉంటే.. నల్గొండ బరిలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఆసక్తికరంగా మారింది. పలువురు అభ్యర్థుల పేర్లు వినిపించినా.. చివరకు శ్రీకళారెడ్డికి టికెట్ ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.
అయితే.. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆమె పోటీ నుంచి వెనక్కి తగ్గారు. దీంతో.. అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ మొదటికి వచ్చింది. దీంతో.. ఈసారి మరింత కసరత్తు చేసిన బీజేపీ నాయకత్వం చివరకు తమ పార్టీ అభ్యర్థిగా కోట రామారావును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. తమ బలం తగ్గలేదని.. ప్రత్యేక పరిస్థితుల్లోనే సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు కోల్పోయామే తప్పించి.. కేసీఆర్ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత గులాబీ పార్టీ మీద పడితే.. సిట్టింగ్ సీటును గెలుచుకోకపోతే.. తెలంగాణలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారటమే కాదు.. మరిన్ని ఇబ్బందులు తప్పవన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమకు కట్టబెట్టిన సీట్లు బలుపే కానీ వాపు ఎంతమాత్రం కాదన్న విషయాన్ని స్పష్టం చేసేలా ఉప ఎన్నిక తీర్పు తమకు అనుకూలంగా ఉండాలని కమలనాథులు భావిస్తున్నారు. దీంతో.. ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిందని చెప్పక తప్పదు.