Begin typing your search above and press return to search.
రామానుజుల విగ్రహం.. ప్రపంచ రికార్డు సొంతం ఎలా అంటే!
By: Tupaki Desk | 5 Feb 2022 10:40 AM GMTతెలంగాణలోని ముచ్చింతల్ ప్రాంతంలో ఏర్పాటైన సమతా మూర్తి... రామానుజుల దివ్య విగ్రహాన్ని ప్రధా న మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు అయితే.. ఈ విగ్రహానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రెండో విగ్రహంగా ఇది రికార్డు సొంతం చేసుకోనుంది. ఇప్పటి వరకు థాయిలాండ్‌లోని బుద్ధ విగ్రహం (301 అడుగులు) కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు దీని తర్వాత.. 216 అడుగుల ఎత్తయిన రామానుజుల విగ్రహం రెండోస్థానం సంపాయించుకుంది.
నిజానికి భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని 2020లో ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం. దీని ఎత్తు 182 మీటర్లు. అయితే.. ఇప్పుడు ఇది మూడోస్థానంలో నిలిచింది. మొత్తం 42 ఎకరాల్లో ఏర్పాటైన రామానుజుల విగ్రహం విశేషాలు చాలానే ఉన్నాయి. అవేంటో.. చూద్దాం...
+ ఈ విగ్రహ ఏర్పాటుకు 2014లోనే చిన్నజీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ప్రవేశద్వారం రూపకల్పన తెలంగాణలోని ప్రసిద్ధ ‘కగాడియా’ శైలిలో రూపొందించారు. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
+ ఆలయ గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఇది రామానుజాచార్యుల జీవితపు 120 సంవత్సరాలను పురస్కరించుకుంటుంది.
+ తామర పువ్వుపై కూర్చున్న రామానుజాచార్యుని విగ్రహం ఐదు లోహాలతో తయారు చేశారు. 42 అడుగుల ఎత్తులో రాగి ఫౌంటెయిన్ కూడా ఏర్పాటు చేశారు. లోపల 54 అంగుళాల ఎత్తులో 120 కిలోల బంగారంతో చేసిన మరో శ్రీరామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది.
+ రామానుజాచార్య విగ్రహం చుట్టూ నల్లరాతితో చెక్కబడిన 108 చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిని దివ్య దేశం అంటారు. ఇవి బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల ఆలయాల తరహాలో రూపొందించడం జరిగింది. మహా విగ్రహం చుట్టూ 8 పుణ్య క్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో ఏకంగా 108 ఆలయాలను నిర్మించారు.
+ ఈ ఆలయాలను అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. మరోవైపు దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఫౌంటెయిన్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
+ దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫౌంటెయిన్ పద్మ పత్రాలు విచ్చుకొనేలా రూపొందించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగేలా తీర్చి దిద్దారు.
+ అలాగే, రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తరువాత మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు.
+ రాజస్థాన్‌లో మాత్రమే లభించే పింక్ గ్రానైట్‌తో తయారు చేసిన పలు ఆకృతులు క్షేత్రం ఆవరణలో కనువిందు చేస్తున్నాయి. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు.
+ రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియంను కూడా నిర్మించారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు, రెండు లక్షల మొక్కలు ఆధ్యాత్మిక శోభను మరింత పెంచేలా దర్శనమిస్తున్నాయి.