Begin typing your search above and press return to search.

మనిషి 'ముఖం'తో వింత చేప .. వీడియో వైరల్ !

By:  Tupaki Desk   |   24 Feb 2021 8:56 AM GMT
మనిషి ముఖంతో  వింత చేప .. వీడియో వైరల్ !
X
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలుచోటుచేసుకుంటుంటాయని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని వింతలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి ఒక వింతే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇండోనేషియాకు చెందిన ఓ జాలరికి వింత అనుభవం ఎదురైంది. తన వలలో చిక్కుకున్న ఓ షార్క్ చేపను చూసి హడలిపోయాడు. దీంతో ఆ చేప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జానికి అది షార్ చేప. మీరు షార్ చేప కళ్లను ఎప్పుడైనా గమనించారో లేదో, అచ్చం మనిషి కళ్లలాగే ఉంటాయి. గుండ్రంగా ఉన్నా కనుగుడ్లు మాత్రం మనిషివి లాగే కనిపిస్తాయి. ఈ చేపలో ఆ కళ్లు రెండూ పక్కపక్కకు వచ్చేశాయి. కింద నోరు కూడా కాస్త మారింది. దాంతో అచ్చం మనిషి ముఖం లాగే తయారైంది.

వివరాల్లోకి వెళ్తే .. 48 ఏళ్ల అబ్దుల్లా నూరెన్ చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లాడు. అది తూర్పు నుసా తెంగ్గరా ప్రావిన్స్‌ లోని రోటో డావో ప్రంతం. ఓ పెద్ద షార్క్ చేప వలలో పడింది. ఓర్నాయనో ఇదేంటి ఇంత పెద్దగా ఉంది. వల చిరిగిపోయేలా ఉందే అనుకుంటూ దాన్ని వేగంగా పడవలో వేసుకున్నాడు. తర్వాత తిరిగి తీరానికి వచ్చి ,ఆ షార్కును తీసుకోని వెళ్లాడు. ఓ ప్రదేశంలో ఉంచి చేప పొట్ట కోశాడు. లోపల మూడు చిన్న షార్క్ చేపలు కనిపించాయి. రెండు చేపల్లో ఎలాంటి ప్రత్యేకతా లేదు. మరో దానికి మాత్రం మనిషి ముఖం ఉంది. ఆశ్చర్యపోయిన ఆయన దాన్ని ఓ నీటి తొట్టెలో వేశాడు. పని ముగిశాక ఇంటికి వెళ్తూ ఆ బేబీ షార్క్‌ ని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు చూసి భలే ఉంది అంటూ దాన్ని ఓ ప్రత్యేక తొట్టెలో వేశారు. ఇప్పడు ఆ వీధిలో ఆ షార్క్ ఓ సెలబ్రిటీ అయిపోయింది. దాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.