Begin typing your search above and press return to search.

హవ్వ.. పరకాల ప్రభాకర్ నుంచి ఇలాంటి కామెంటా?

By:  Tupaki Desk   |   6 April 2023 8:44 PM
హవ్వ.. పరకాల ప్రభాకర్ నుంచి ఇలాంటి కామెంటా?
X
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ముందు నుంచి ఫాలో అవుతున్న వారికి పరకాల ప్రభాకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయ ప్రయాణం విషయంలో చాలామందికి.. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను అభిమానించే వారికి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ముందుగా ప్రజారాజ్యం పార్టీలో చేరి.. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన పరకాల.. పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్‌లోనే కూర్చుని టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అవి పీఆర్పీకి బాగా డ్యామేజ్ చేశాయి. తర్వాత ఆయన టీడీపీ మద్దతుదారుగా మారడం.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక పదవి పొందడం చూసి చిరు అభిమానులు నివ్వెరపోయారు. ఆయన్నో కోవర్టుగా అభివర్ణించారు.

ఈ విషయంలో ఇప్పటికీ పరకాల మీద చిరు అభిమానుల కోపం తగ్గలేదు. సందర్భం వచ్చినపుడల్లా పరకాల మీద సోషల్ మీడియాలో విరుచుకుపడుతుంటారు. పరకాల సైతం వారికి దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఐతే తాజాగా ఒక నెటిజన్ ప్రజారాజ్యం పార్టీ గురించి ఒక లెంగ్తీ పోస్టు పెట్టాడు ట్విట్టర్లో.

దాని కింద ఒక చిరు అభిమాని స్పందిస్తూ.. పరకాలను తిట్టిపోశాడు. ''అరేయ్ పరకాలగా. డబ్బులకు అమ్ముడుపోయి పీఆర్పీ లాంటి ఉన్నత విలువలు ఉన్న ఒక పార్టీ మీద విషం కక్కావు. కర్మ ఎవరినీ వదలదు రా. కుక్క చావు చస్తావు. ఏపీ ప్రజలకి ఒక మంచి సీఎంని మిస్ చేయించావ్'' అని ఆ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. కానీ ఊరూ పేరూ లేని వాళ్లు సోషల్ మీడియాలో ఇలాంటి మాటలు అంటారు. పేరున్న వ్యక్తులు వాటిని పట్టించుకుని వాళ్ల స్థాయికి దిగి మాట్లాడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.

ఒకవేళ స్పందించినా.. తమ స్థాయి దృష్ట్యా మాటలు పద్ధతిగా ఉండేలా చూసుకోవాలి. కానీ పరకాల అలా చేయలేదు. ''ఆ రోజుల్లో నీ అమ్మని రోజూ మింగేవోడినని నీకున్న కోపం ఇప్పుడు ఇలా వాగి తీర్చుకుంటున్నావు. పాపం నీ బాధ అర్థం అయింది'' అని ఆయన వ్యాఖ్యానించాడు.

ఒక బూతు మాటను ఒక అక్షరం మార్చి ప్రయోగించినంత మాత్రాన అర్థం మారదు. ఇలాంటివి తక్కువ స్థాయి వాళ్లు మాట్లాడే మాటలు. పరకాల స్థాయికి ఇది మరీ దిగజారుడు కామెంటే. అవతలి వ్యక్తి ఏమన్నాడన్నది పక్కన పెడితే.. ఒక కేంద్ర మంత్రి భర్త, స్వతహాగా ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన ఫాలోవర్లకే మింగుడుపడటం లేదు. ఈ విషయంలో పరకాలనే తప్పుబడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.