Begin typing your search above and press return to search.

గాడిత‌ప్పిన త‌మ్ముడు.. టీడీపీపై ఘాటు వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   24 Nov 2022 2:30 AM GMT
గాడిత‌ప్పిన త‌మ్ముడు.. టీడీపీపై ఘాటు వ్యాఖ్య‌లు
X
ఆయ‌న‌కు పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా మంచి భ‌విష్య‌త్తు ఉండాల‌ని భావించారు. ఆయ‌న‌కు 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గౌర‌వించారు. ఆయ‌న‌కు పార్టీలో అత్యున్న‌త గౌర‌వాన్ని కూడా చంద్ర‌బాబు క‌ల్పించారు. క‌ట్ చేస్తే.. మ‌రి ఆయ‌న ఏం చేశారు? పార్టీ ప‌రువును గాలిలో క‌లిపేశారు. పార్టీ గురించి మ‌డ‌త మాట్లాలు మాట్లాడేశారు. పార్టీ అంత‌ర్గ‌త విష‌యాల‌ను రోడ్డున ప‌డేశారు. మ‌రి ఆయ‌న ఎవ‌రు? ఏం చేశారు? ఇలాంటి నేత‌ల‌ను చంద్ర‌బాబు ఎందుకు స‌హిస్తున్నారు? చ‌దవండి..

బీకే పార్థ‌సార‌థి. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా(ప్ర‌స్తుతం శ్రీస‌త్య‌సాయి జిల్లా)లో కుర‌బ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. ఈయ‌న‌ను చంద్ర‌బాబు 2007లో పార్టీలోకి తీసుకున్నారు. పార్టీ అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉంది. ఈ స‌మ‌యంలో బాగా ప‌నిచేస్తున్నార‌నే ఉద్దేశంతో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కింది. ఈ క్ర‌మంలోనే 2009, 2014, 2019 వ‌రుస ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రోత్స‌హించారు. అనంత‌పురంలో ఎంతో మంది నాయ‌కులు ఉన్నా.. బీకే పార్థ‌సార‌థి విష‌యంలో చంద్ర‌బాబు దృష్టి కోణం వేరు.

పార్టీకి అంకిత భావంతో ప‌నిచేసిన నాయ‌కుడిగా ఆయ‌న‌ను గుర్తించారు. కుదిరితే మంత్రి ప‌దవి కూడా ఇవ్వాల‌ని 2014లో ప‌రిశీలించారు. కుద‌ర‌క‌పోవ‌డంతో విప్ ప‌ద‌విని ఇచ్చారు. 2009, 2014లో వ‌రుస విజ‌యాలు కూడా ద‌క్కించుకున్నారు. 2019లో మాత్రం ఆయ‌న ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీలో నిబ‌ద్ధ‌త గ‌ల నాయ‌కుడిగా చంద్ర‌బాబు ఆయ‌న‌ను గుర్తించారు. అనంత‌ప‌ర్య‌ట‌న అంటే.. బీకే పార్థ‌సార‌థి లేకుండా చంద్ర‌బాబు ఎప్పుడూ ముందుకు సాగిన ప‌రిస్థితి లేదు.

అలాంటి పార్త‌సారథి తాజాగా.. అన్నం పెట్టిన పార్టీపై సున్నంకొట్టే వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీలో టికెట్ ద‌క్కించుకోవాలంటే కోట్లు ఉండాల‌ని వ్యాఖ్యానించారు. తాజాగా కురుబ సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో భేటీ అయిన ఆయ‌న‌.. పార్టీ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. సంచ‌ల‌నం సృష్టించారు.

డ‌బ్బులు బాగా సంపాయించుకుని రావాల‌ని.. డ‌బ్బులేక‌పోతే, పార్టీలో విలువ లేద‌ని నోరు పారేసుకున్నారు. దీంతో ఈ విష‌యం రాజ‌కీయంగా పార్టీకి తీవ్ర డ్యామేజీ అయిపోయింది. ప్ర‌ధాన ప‌క్షం వైసీపీ నాయ‌కులు బీకే చేసిన వ్యాఖ్య‌ల‌తో టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. మ‌రి చంద్ర‌బాబు ఇలాంటి నాయ‌కుల‌ను ఎందుకు ఉపేక్షిస్తున్నారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.